July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

బిర్యానీ బిల్లు ఎక్కవ వేశారంటూ జవాన్ల గొడవ! ఎక్కడంటే?

దేశ రక్షణ కోసం పోరాడే జవాన్ల కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. ఎందుకంటే..దేశంలోని కోట్లాదిమంది ప్రజలను కాపాడటం కోసం రాత్రి, పగలు వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతగానో కష్టపడుతుంటారు. కనుక అలాంటి జవాన్లను తలుచుకున్న, వారి కోసం ప్రస్తావించినా చాలా గర్వంగా అనిపిస్తుంది.అలా దేశంకోసం తన కుటుంబన్ని, ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న జవాన్లను చాలామంది చూస్తున్నాం.కానీ ముఖ్యంగా శత్రుత్వ దేశాలతో పోరాడి దేశాన్ని కాపడుతూ.. కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్న జవాన్లు ఉన్న ఈరోజుల్లో..తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం ఆ వృత్తికే మచ్చే తెచ్చేలా కొందరు ప్రవర్తించారు. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇటీవలే ఆంధ్రలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో విధులకు హాజరై తిరుగు ప్రయాణంలో విశ్రాంతి కోసం ఆగిన భద్రతా సిబ్బంది భోజనం వెళ్లి హోటల్‌ కు వెళ్లి అక్కడ మొత్తం ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటన మంగళవారం బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎన్నికల విధులకు వచ్చిన జవానులు స్థానిక జడ్పీహెచ్‌ పాఠశాలలో విశ్రాంతికి ఆగిన ఐటీబీపీ మంగళవారం మధ్యాహ్నం గుళ్లపల్లిలోని మిలటరీ పిచ్చయ్య అభిరుచి హోటల్‌కు బిర్యానీ కోసం వెళ్లారు. కాగా,  అక్కడ బిర్యాని తిన్నాక బిల్లు ఎక్కువగా ఉందని హోటల్‌ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. అయితే అక్కడ సిబ్బంది  సర్ది చెప్పే క్రమంలోనే.. జవానులు హోటల్‌  సిబ్బందిపై దాడి చేశారు. ఇక వారిలో ఒకరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్న తమ వారికి విషయం చెప్పగానే..  వెంటనే కొందరు జవాను దుస్తుల్లో అక్కడికి వచ్చి హోటల్‌ అద్దాలు పగులకొట్టారు. ఇక అక్కడ బిర్యానీ తింటున్న ఇతరులపై దాడి చేశారు.

అయితే అక్కడ హొటల్‌ లో గోపి అనే యువకుడిని కొట్టడంతో పెదవులు పగిలి రక్తస్రావమైంది. అలాగే హోటల్‌ సిబ్బందిలోని కొందరి దుస్తులు కూడా చిరిగిపోయాయి. ఇకపోతే హోటల్‌ యజమాని కుమారుడు నాగేశ్వరరావు అడ్డుకునే ప్రయత్నం చేయగా ..అతనిపై కూడా వారు దాడి చేశారు. అలా అక్కడ నుంచి బయటకు వచ్చిన జవాన్లు జాతీయ రహదారిపై వచ్చిపోయే వారిపైనా దాడి చేసేందుకు ప్రయతద్నించారు. కానీ,వారిని చూసి చుట్టుపక్కల వారు పరుగులు తీశారు.ఈ క్రమంలో ఆ జవానుల్లో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక ఈ దాడి ఘటనతో గ్రామస్థులు జాతీయ రహదారిపైకి చేరుకుని హోటల్‌ ఎదురు నిరసనకు దిగారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

కానీ, జవానులు మళ్లీ పాఠశాల నుంచి బయటకు వస్తుండటంతో.. ఎస్సై వై.సురేష్‌ వారిని లోపలకు పంపించారు.  ఇక ఇరువర్గాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రేపల్లె గ్రామీణ సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలికి చేరుకుని వారితో మాట్లాడారు. కాగా, జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకుని ఐటీబీపీ అసిస్టెంట్ కమాండెంట్ సాషితో మాట్లాడారు. అయితే ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, బయట పరిస్థితిని ఆయనకు వివరించారు. ఇక ఆయన హోటల్‌ వారితో తాను మాట్లాడతానని చెప్పడంతో అంతా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బాధితులతో మాట్లాడి రాజీ చేశారు.

Also read

Related posts

Share via