SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: కూతురు పెళ్లికి సహకరించిన వ్యక్తిపై పగపెంచుకున్న ఓ తండ్రి.. ఏం చేశాడో తెలుసా..?

 

జస్ట్‌ మిస్‌. లేకపోతే ప్రేమ పెళ్లికి సహకరించినందుకు ఆ వ్యక్తి అనంతలోకాలకు చేరేవాడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మర్డర్ స్కెచ్‌ ఫెయిల్‌ అయింది. నిందితులు రెక్కీ నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. కూతురు పెళ్లికి సహకరించిన వ్యక్తిపై పగపెంచుకున్న నర్సింహరావు, సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.


ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మర్డర్ స్కెచ్‌ ఫెయిల్‌ అయింది. నిందితులు రెక్కీ నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. కూతురు పెళ్లికి సహకరించిన వ్యక్తిని హతమార్చేందుకు ఫ్లాన్ చేశాడు ఓ వ్యక్తి. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొడూరు మండలం కొండూరుకు చెందిన రమ్యశ్రీని నందిగామ మండలం ఐతవరానికి చెందిన మొవ్వ వీర్రాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి వీర్రాజు సమీప బంధువు జూనియర్ లైన్‌మెన్ మొవ్వ గోపీ సహకరించాడు. దీంతో మొవ్వ గోపీపై రమ్యశ్రీ తండ్రి కోలా నరసింహరావు పగ పెంచుకున్నాడు. అతన్ని హత్య చేయించాలని కుట్ర పన్నాడు.


కూతురు ప్రేమ పెళ్లికి సహకరించిన గోపీని చంపించాలనుకున్నాడు కోలా నరసింహరావు. హైదరాబాద్‌కు చెందిన పాలంపల్లి విజయ్ కుమార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గోపీ హతమార్చేందుకు లక్ష రూపాయల సుపారీ ఇచ్చాడు. సంక్రాంతి సమయంలో కోడి కత్తులతో చంపాలని చెప్పాడు. దీంతో సంక్రాంతి రోజు విజయ్‌ కుమార్ మరో ముగ్గురితో కలిసి ఐతవరం వెళ్లాడు. మొవ్వ గోపిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు. అప్పుడు హత్యకు వీలుపడక పోవడంతో ఫిబ్రవరి 2న నందిగామలో హత్యకు ప్లాన్ చేశారు. మయూరి టాకీస్ సెంటర్‌లో విజయ్‌కుమార్ టీమ్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో హత్య ప్లాన్‌ను మొత్తం బయటపెట్టింది సుపారీ గ్యాంగ్‌.

విజయ్‌ కుమార్ సహా ఇద్దరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. వారి నుంచి కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు కుట్ర చేసిన కోలా నర్సింహరావును కూడా రిమాండ్‌కు తరలించారు పోలీసులు. మరోవైపు తన హత్యకు కుట్ర జరిగిందన్న విషయం తెలుసకున్న గోపి షాక్‌ అయిపోయాడు. హత్య కుట్ర భగ్నం చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు

Also read

Related posts

Share this