శివాజీనగర: అప్పా, అమ్మా నన్ను క్షమించండి.. అని డెత్ నోట్ రాసి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని బెంగళూరు విశ్వవిద్యాలయం (జ్ఞానభారతి) మహిళా హాస్టల్లో ఈ సంఘటన జరిగింది. మైసూరు జిల్లా హెచ్ఎ కోట హెబ్బలగుప్పహళ్లికి చెందిన హెచ్.ఎన్ పావన (23) మృతురాలు. ఆమె కన్నడ అధ్యయన కేంద్రంలో పీజీ ఫైనలియర్ చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం హాస్టల్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. స్థానిక పోలీసులు చేరుకొని గాలించగా డెత్నేట్ లభించింది. అందులోని అంశాలను గోప్యంగా ఉంచారు.
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..





