July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

ఏపీ పోలింగ్ ఘటనలపై పోలీసులు సీరియస్.. వీళ్లపై కేసులు..

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్ డే, ఆ తర్వాత జరిగిన హింసపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. గురజాల నియోజకవర్గంలో మొత్తం 192 మంది మీద కేసులు నమోదు చేశారు. అందులో కేసానుపల్లి, నడికుడి, ఇరికెపల్లి, మాదినపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు గ్రామాల్లో గొడవలు జరగగా.. దాచేపల్లిలో 70 మంది మీద కేసులు నమోదయ్యాయి. కేవలం గురజాల మండలంలోని చర్లగుడిపాడు, దైద గ్రామాల్లో గొడవలు జరగ్గా ఇప్పటివరకు 10 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే మాచవరం మండలంలో 45 మంది మీద కేసులు నమోదైనట్లు తెలిపారు అధికారులు.

పిడుగురాళ్ల మండల పరిధిలోని పెద్ద అగ్రహారం, కరాలపాడు, బ్రాహ్మణ పల్లి గ్రామాల్లో మొత్తం 67 మందిపై సెక్షన్ 307, 324, 323 కింద కేసులు బుక్ చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో 34 కేసులు నమోదు కాగా మరికొందరు నిందితులను గుర్తిస్తున్నామన్నారు డీఎస్పి. అలాగే సమస్యత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పెదకూరపాడు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అచ్చంపేట మండలం వేల్పూరు, కొత్తపల్లి, చింతపల్లిలలో జరిగిన అల్లర్లలో ఇరువర్గాలు ఫిర్యాదు చేయగా ఈమేరకు 5 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. ఇందులో మొత్తం 39 మంది నిందితులను గుర్తించారు.

Also read

Related posts

Share via