తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తుడు చిలక భార్గవ సాయితేజ శివుడి ఆజ్ఞగా భావించి, నాణాలతో ప్రత్యేకమైన శివలింగాన్ని తయారుచేశాడు. సుమారు రూ. 1.3 లక్షల విలువైన నాణాలతో రెండు నెలలపాటు శ్రమించి దీనిని రూపొందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా..
తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన శివభక్తుడు చిలక భార్గవ సాయితేజ, తన అసాధారణ భక్తితో ఒక ప్రత్యేకమైన శివలింగాన్ని రూపొందించాడు. సాధారణ నాణాలకు ఆధ్యాత్మిక విలువను ఆపాదించి, సుమారు రూ. 1.3 లక్షల విలువైన నాణాలతో ఈ శివలింగాన్ని తయారుచేశారు. తన కలలో శివుడు నాణాలతో శివలింగం చేయమని ఆదేశించాడని, ఆ కలను శివుడి ఆజ్ఞగా భావించి ఈ కార్యానికి పూనుకున్నానని సాయితేజ వెల్లడించాడు. రెండు నెలల పాటు రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయల నాణాలను సేకరించాడు. స్నేహితులు, ఇతర భక్తులు ఈ నాణాల సేకరణలో అతడికి సహకరించారు. సాయితేజ తండ్రి చిలక గంగేశ్వరరావు, తల్లి యోజన కపూసి రత్నం. చిన్నప్పటి నుంచీ శివుడంటే తనకు ఎంతో ఇష్టమని సాయితేజ తెలిపాడు.
ఈ ధనలింగాన్ని పట్టిసీమలో ఉన్న వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్టించి, మహాశివరాత్రి సందర్భంగా నిత్య పూజలు జరిగేలా చూడాలనే ఆలోచనతో ఈ బృహత్కార్యాన్ని చేపట్టాడు. గతంలో సాయితేజ అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమలకు కాలినడకన పాదయాత్ర చేశాడు. ఆ అనుభవం తన జీవితాన్ని మార్చిందని, తిరిగి వచ్చాక తన ఇంటి దగ్గర శబరిమల ఆలయ నమూనాలోనే ఒక చిన్న గుడిని నిర్మించుకున్నానని తెలిపాడు. ఆ ఆధ్యాత్మిక స్ఫూర్తితోనే ఇప్పుడు నాణాలతో శివలింగాన్ని తయారుచేశానని వివరించాడు. శివయ్య ఆజ్ఞ లేనిదే ఏమీ చేయలేమని, ఈ శివలింగ నిర్మాణం కూడా ఆయనే చేయించారని సాయితేజ దృఢంగా నమ్ముతున్నాడు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





