March 12, 2025
SGSTV NEWS
Andhra PradeshSpiritual

Vontimitta Brahmotsavam: సీతారాముల కల్యాణానికి ముహూర్తం ఖరారు.. నవమి వేడుకల వివరాలు ప్రకటించిన టీటీడీ చైర్మన్

భక్తులకు సేవలు అందించేందుకు అవసరమైన శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలని, భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని కోరారు. అత్యవసర వైద్య సేవలు, అవసరమైన మందులు నిల్వ ఉంచాలన్నారు. శాఖలవారీగా అధికారులు చేయనున్న పనులను ఛైర్మన్ కు వివరించారు.


టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కడప జిల్లాలోని ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో పర్యటించారు. ఇక్కడి కోదండ రామాలయంలోని కల్యాణ వేదికను పరిశీలించారు. త్వరలో శ్రీరామనవమి వస్తున్న నేపథ్యంలో, కల్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. ఏప్రిల్ 5 నుంచి 15వ తేదీ వరకు ఒంటిమిట్ట రాముల వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. ఏప్రిల్ 11న సీతారాముల కల్యాణం ఉంటుందని తెలిపారు. ఒంటిమిట్ట రాముల వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు, ముత్యాలు, తలంట్రాలు అందజేస్తారని వివరించారు. సీతారాముల కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ముత్యాల తలంబ్రాలు అందజేస్తామని బీఆర్ నాయుడు వెల్లడించారు.


శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణానికి భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల తాకిడికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ మరియు పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం రోజున ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగ రాదని, అవసరమైన జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు, వేసవి నేపథ్యంలో అగ్ని మాపక శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆహ్వానం పత్రికలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

భక్తులకు సేవలు అందించేందుకు అవసరమైన శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలని, భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని కోరారు. అత్యవసర వైద్య సేవలు, అవసరమైన మందులు నిల్వ ఉంచాలన్నారు. శాఖలవారీగా అధికారులు చేయనున్న పనులను ఛైర్మన్ కు నివేదించారు. అంతకు ముందు కల్యాణ వేదిక ప్రాంగణాన్ని టిటిడి ఛైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు.

Also read


Related posts

Share via