విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితుడు క్రాంతి కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు. భీమిలి దాకమర్రి లేఔట్‌లో మహిళను దారుణంగా హత్య చేసి ఆపై ముఖం మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు నిందితుడు క్రాంతి కుమార్.. మృతురాలు మాలికవలస ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మిగా గుర్తించారు పోలీసులు. ఈ ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందని తెలిపారు. బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు.. ఆమెను హత్య చేసి ఆపై గుర్తుపట్టకుండా ముఖాన్ని కాల్చేశాడు..
పదేళ్ల క్రితం మృతురాలు వెంకటలక్ష్మి భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లలతో కలిసి వెంకటలక్ష్మి మారికవలసలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు కొంత కాలం క్రితం క్రాంతి కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.. ఏమైందో ఏమో కాని.. క్రాంతి వెంకటలక్ష్మిని.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు.. ఆ తర్వాత పెట్రోల్ పోసి తగబెట్టాడు..
భీమిలి తగరపువలస, విజయనగరం రోడ్‌లోని లేఅవుట్ ప్రాంతంలో మహిళ మృతదేహం ఉన్నట్టు స్థానికులు శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దీంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు.. దాకమర్రిలోని ఫార్చ్యున్ లే ఔట్‌లో ఉన్న మహిళ మృతదేహాన్ని .. పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అనంతరం అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన వైజాగ్ పోలీసులు .. వెంకటలక్ష్మిని క్రాంతి హత్య చేసినట్లు నిర్ధారించారు. కాగా.. వెంకటలక్ష్మి మృతితో ఆమె పిల్లలు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. నిందితుడికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు
Also Read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





