Vijayawada Drugs Bust: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ రవాణాపై నిఘా పెట్టిన ఈగల్, జీఆర్పీ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.. ఈ తనిఖీల్లో 110 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ఓ యువతి పట్టుబడింది.. బెంగళూరు నుంచి విజయవాడకు మత్తు పదార్థాలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.. పక్కా సమాచారంతో విజయవాడ రైల్వే స్టేషన్లో యువతిని అదుపులోకి తీసుకున్న ఈగల్, జీఆర్పీ బృందాలు.. ఆమె నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి.. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు..? విజయవాడలో ఎవరికి సరఫరా చేయబోతున్నారు..? ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అన్న కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు డ్రగ్స్ తో పట్టుబడిన యువతి విజయవాడ పటమటకు చెందిన యలమశెట్టి సౌమ్యగా పోలీసులు గుర్తించారు.
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిఘా పెట్టిన ఈగల్, జీఆర్పీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 110 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ఓ యువతి పట్టుబడింది. బెంగళూరు నుంచి విజయవాడకు మత్తు పదార్థాలను తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. పక్కా సమాచారంతో విజయవాడ రైల్వే స్టేషన్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.10 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
డ్రగ్స్ పట్టుబడిన యువతిని విజయవాడ పటమటకు చెందిన యర్రమశెట్టి నాగ సౌమ్యగా గుర్తించారు. ఆమె ఎంబీఏ చదువుతున్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న క్రమంలో ఈగల్, జీఆర్పీ బృందాలు ఆమెను పట్టుకున్నాయి. అనంతరం డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసిన జీఆర్పీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయవాడలో పలువురికి ఈ మత్తు పదార్థాలను విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు ఈగల్ అధికారులు గుర్తించారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి సేకరించారు?, విజయవాడలో ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు?, ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
నాగ సౌమ్యకు సంబంధించిన మరో అంశం కూడా దర్యాప్తులో ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఏడాది ఆమె ప్రియుడిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా నాగ సౌమ్య డ్రగ్స్ కొరియర్ వ్యవహరిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు జీఆర్పీ పోలీసులు పేర్కొన్నారు. అయితే గత కేసుకు, ప్రస్తుత డ్రగ్స్ రవాణా వ్యవహారానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. విజయవాడ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ తనిఖీలతో నగరంలో డ్రగ్స్ సరఫరా నెట్ వర్క్ పై మరోసారి దృష్టి పడింది.
Also read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



