వాళ్లంతా ఓ శుభకార్యానికి వచ్చారు.. అంతా సరదాగా గడిపారు. అదే ఉత్సాహంతో బీచ్‌లో విహరించేందుకు వెళ్లారు. అక్కడ సరదాగా ఇసుకతిన్నెల్లో ఆడుకున్నారు. కానీ అంతలోనే అంతులేని విషాదం సంభవించింది. ఒకరిని రక్షించబోయి మరొకరు ఇద్దరు యువకులు కెరటాల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి యువకుల మృతితో వారి కుటుంబంతో పాటు ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సరదాగా బీచ్‌లో విహరించేందకు వెళ్లిన ఇద్దరు యువకుల సముద్రం తీరంలో ఏర్పడి కెరటాల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పెంటకోటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా పాయక రావుపేట ఎస్సీ కాలనీలో కంపల చెల్లారావు కుటుంబం నివాసం ఉంటుంది. ఇటీవల వాళ్ళ ఇంట్లో ఓ శుభకార్యం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు అల్లూరి జిల్లా రాజవొమ్మంగికి చెందిన మరో కుటుంబం వచ్చింది. ఆ కుటుంబంలో ఓ యువకుడు హైదరాబాదులో చదువుతున్నాడు. హైదరాబాదు నుంచి అభిలాష్ కూడా ఆ శుభకార్యానికి హాజరయ్యాడు. అందరూ సరదాగా గడిపారు. తర్వాత పెంటకోట బీచ్‌కు వెళ్లారు. ఇక కొంతమంది బీచ్ ఒడ్డున ఉండగా.. మరి కొంతమంది నీటిలో స్నానం చేస్తూ ఉన్నారు. ఇంతలో ఓ భారీ కెరటం.. పిల్లి అభిలాష్‌ను అమాంతంగా లోపలకు లాగేసింది. అది గమనించి కాపాడేందుకు వెళ్లిన గంపల హరీష్ అనే మరో యువకుడు కూడా సముద్రపు కెరటాల్లో కొట్టుకుపోయాడు.
అది గమనించిన కటుంబ సభ్యులు కేకలు వేయడంతో.. సమీపంలోని మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు అక్కడకు చేరుకొని సముద్రంలో గల్లంతయిన వారి కోసం గాలించారు. జాడ కనిపించలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపేశారు. ఇంతలో హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడంతో ఆమెకు విషయం తెలిసింది. సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇక ఇంతలోనే బీచ్ సమీపంలోని ఉప్పుటేరులో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చినట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా అక్కడ అభిలాష్, హరీష్ మృతదేమాలు కనిపించాయి. ఆ మృతదేహాలను చూసిన కుటుంబసభ్యలులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చేతికి అంది వచ్చిన ఇద్దరు యువకులు కెరటాలకు బలవడంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలోకి వెళ్లాయి.
పిల్లలను ప్రయోజకులుగా చేయాలని..
కాగా మృతుల్లో గంపల హరీష్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, అల్లూరి జిల్లా రాజవొమ్మంగికి చెందిన పిల్లి అభిలాష్ హైదరాబాద్‌లో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తూ ప్రయోజకులను చేయాలనుకున్న తమ ఆశలను సముద్రం అడియాసలు చేసిందంటూ మృతుల తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. అభిలాష్, హరీష్ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని స్థానిక సిఐ అప్పన్న తెలిపారు.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు