SGSTV NEWS
Spiritual

Garuda Puran: గరుడ పురాణంలో ఆత్మహత్య చేసుకున్న జీవికి వేసే శిక్షలు తెలిస్తే.. సూసైడ్ అన్న మాటే తలవరు

హిందూ మతంలో మొత్తం 18 పురాణాలున్నాయి. ఈ పురాణాలలో ఒకటి గరుడ పురాణం. ఇందులో మానవుని కర్మల గురించి, వాటి ఆధారంగా అతనికి లభించే మంచి , చెడు ఫలితాల గురించి చెప్పే గ్రంథం. మనిషి జీవితం, జీవన విధానం మాత్రమే కాదు మరణించిన తర్వాత జీవి ప్రయాణం గురించి పేర్కొంది. అందులో మనిషి తన ఆయుస్సు తీరకుండా ఆత్మహత్య చేసుకుని బలవంతంగా మరణిస్తే కూడా ఆ జీవికి నరకంలో విధించే శిక్షల గురించి తెలియజేసింది.


గరుడ పురాణం ఆధ్యాత్మిక గ్రంథం. సనాతన ధర్మంలోని అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఇందులో శ్రీ మహా విష్ణువు మరణం తరువాత ఆత్మకు ఏమి జరుగుతుందో ప్రస్తావించబడింది. ఈ పురాణం మనిషి తన జీవితాన్ని మంచి పనులు చేస్తూ జీవించమని సలహా ఇస్తుంది, పాపపు పనులు లేదా అన్యాయమైన చర్యలకు పాల్పడేవారికి విధించే శిక్షల గురించి కూడా వివరించింది. గరుడ పురాణంలో శ్రీ మహా విష్ణువు మనిషి మరణానంతరం జీవి ప్రయాణం సుఖ వంతంగా సాగాలంటే ఇలలో భక్తిని, సుఖ సంతోషాలను కలిగించే శుభ కార్యాలను ప్రస్తావిస్తుంది.

ఈ పురాణంలో ప్రతి పాపానికి శిక్ష కూడా వివరించబడింది. వాటిలో ఒకటి ఆత్మహత్య. ఆత్మహత్య అనేది మహా పాపం కిందకు వస్తుంది. దేవుడు ఇచ్చిన విలువైన మానవ శరీరానికి హాని కలిగించి ఆత్మహత్య చేసుకునే వ్యక్తిని పాపిగా పరిగణిస్తారు. అలాంటి వారు అకాల మరణం తర్వాత చెడు స్థితిని అనుభవిస్తారు. గరుడ పురాణం ప్రగరుడ పురాణం ప్రకారం మనిషి జన్మ ఎత్తిన తర్వాత జీవితంలోని ఏడు చక్రాలను పూర్తి చేయడానికి ముందే ఆత్మహత్య చేసుకుని మరణించే వారి ఆత్మలు భయంకరమైన బాధను అనుభవించాల్సి ఉంటుంది. అగ్నిలో కాలిపోవడం, ఆత్మని పదే పదే ఉరి వేయడం, కాలకూట విషం తాగించడం, పాము కాటు వేయడం వంటి వివిధ దారుణమైన శిక్షలను ఆత్మ అనుభవించాల్సి ఉంటుంది. తమ ఆయుస్సు తీరకుండా మరణ సమయం ఆసన్నం కాక ముందే మరణించే వారందరూ అకాల మరణాల వర్గంలోకి వస్తారు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం మానవ జన్మ సులభంగా లభించదు. మానవ జన్మ ఎత్తేందుకు ఒక జీవి 84 లక్షల జన్మలు సంచరించాలి. అప్పుడు మాత్రమే దేవుడు కృప లభించి ఆ జీవికి మానవ జన్మ ఎత్తే వరాన్ని ప్రసాదిస్తాడు. అంత విలువైన మానవ జన్మ లభించిన తర్వాత వివిధ కారణాలతో ఆత్మ హత్య చేసుకున్నందుకు ఆ పాప కర్మకు చాలా బాధపడవలసి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని 13 వేర్వేరు ప్రదేశాలకు పంపుతారు. ఏడు నరకాలలో అత్యంత భయంకరమైన నరకంలో 60,000 సంవత్సరాలు గడపవలసి ఉంటుంది.

గరుడ పురాణం ప్రకారం సాధారణంగా మరణం తరువాత 30 లేదా 40 రోజులలోపు, ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. అయితే ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు నిరవధికంగా తిరుగుతూనే ఉంటాయి. అలాంటి పాపాత్మలకు నరకంలో గానీ, స్వర్గంలో గానీ స్థానం అభించలేదు. ఈ ఆత్మలు భూమికి, స్వర్గానికి, నరకానికి మధ్య తిరుగుతూ ఉంటాయి. కారణం ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆత్మ నరకంలో ఎలాంటి బాధను అనుభవించాల్సి ఉంటుందో.. ఆత్మని ఎలా చూస్తారో తెలుసుకుందాం.

Related posts

Share this