శ్రీకాకుళం జిల్లాలో స్నేహితుల దినోత్సవం రోజు తీవ్ర విషాదం నెలకొంది. నదిలో స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు వెళ్లిన ఒక యువకుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుల సమాచారంతో ఘటనా స్థానికి చేరుకున్న స్థానికులు యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటిదాకా తమతో సరదాగా గడిపిన స్నేహితుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అతని ఫ్రెండ్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు.
శ్రీకాకుళం జిల్లాలో స్నేహితుల దినోత్సవం రోజు విషాదం నెలకొంది. సరదాగా స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు నదికి వెల్లిన ఒక యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. స్నేహితుల దినోత్సవం రోజే తమ స్నేహితుడు ప్రాణాలు కోల్పోవడంతో సదరు యువకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళితే.. బూర్జ మండలం లాబాం గ్రామ సమీపంలో ఆరుగురు స్నేహితులు నాగవళి నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఇక స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. అయితే కాసేపు స్నానం చేసిన తర్వాత ఐదుగురు స్నేహితులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. దుర్గాప్రసాద్ (19) అనే యువకుడు మాత్రం నీటి లోతు ఎక్కవగా ఉన్న ప్రాంతానికి వెల్లి చిక్కుకుపోయాడు.
స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఎలాంటి లాభం లేకపోయింది. దీంతో ఫ్రెండ్స్ స్థానికులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు దుర్గాప్రసాద్ కోసం నదిలో తీవ్రంగా గాలించారు. చాలా సేపటి తర్వాత దుర్గా ప్రసాద్ ఆచూకీని కనిపెట్టారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారంతో ఘటానా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి.. దుర్గాప్రసాద్ మృతదేహాన్ని శ్రీకాకుళం GGHకు తరలించారు. మృతి చెందిన దుర్గాప్రసాద్ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని బల్లంకి వీధికు చెందిన యువకుడుగా పోలీసులు గుర్తించారు. మృతుడు పాలకొండలోని తమ్మినాయుడు కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. దుర్గాప్రసాద్ మృతితో పాలకొండ లోను విషాదచాయలు అలుముకున్నాయి
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





