April 15, 2025
SGSTV NEWS
Andhra PradeshViral

వామ్మో ఇవేంటి..? వలలో చిక్కినవి చూసి షాకైన జాలర్లు..



పట్టుకుంటే ‘ముళ్ల’ బొడుస్తాయ్‌… ఆ తర్వాత నొప్పితో విలవిల్లాడిపోవాల్సిందే.. ఇంతకీ ఇవి ఏంటి అనుకుంటున్నారా… ముళ్లు ఉండే ఓ జాతి కప్పలు. విశాఖ నగరం రుషికొండ తీరంలో సోమవారం మత్స్యకారుల వలకు ఇలాంటి ముళ్ల కప్పలు చిక్కాయి. వాటిని తిరిగి సంద్రంలో వదిలిపెట్టారు.


కప్పలు మనకి తరచూ తారసపడుతూనే ఉంటాయి. పల్లెటూర్లు మాత్రమే కాదు.. సిటిల్లోనూ కనిపిస్తాయి. అయితే వర్షాలు పడిన సమయంలో కొన్నిసార్లు.. పెద్ద పెద్ద లావైన పసుపు పచ్చ కప్పలు కనిపిస్తూ ఉంటాయి. అవి ‘ఇండియన్ బుల్ ఫ్రాగ్’ జాతి కప్పలు. కానీ పైన ఫోటోలో ఉన్న కప్పల్ని మాత్రం మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే దాని ఒళ్లంతా ముళ్లే ఉన్నాయి. ఈ వింత కప్పలు జనాల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి.

సముద్రం ఎన్నో రకాల జీవులకు ఆవాసం. సంద్రంలో వివిధ రకాల కప్పులు సైతం జీవనం సాగిస్తాయి. తాజాగా ముళ్ల కప్పలు రుషికొండ తీరంలో జాలర్ల వలలో చిక్కాయి. సముంద్రంలో ఏవైనా ఇతర జీవులు తమపై దాడి చేసినప్పుడు శరీరంపై ఉన్న ముళ్ల సాయంతో ప్రతిఘటించి.. ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాయని జాలర్లు చెబుతున్నారు.  ఈ కప్పల ముళ్లు గుచ్చుకుంటే మాత్రం నొప్పి తీవ్రత చాలా దారుణంగా ఉంటుందంటున్నారు. సాధారణంగా వలలకు చిక్కే ఈ తరహా జీవుల్ని మత్స్యకారులు తిరిగి సముద్రంలోనే వదిలిపెడుతూ ఉంటారు. అలా చేస్తేనే జీవ వైవిధ్యం బాగుంటుందని అంటున్నారు

Also Read

Related posts

Share via