ఉత్కంఠకు తెరపడింది. కొంతకాలంగా అఘోరీ చెరలో ఉన్న శ్రీవర్షిణీకి విముక్తి లభించింది. ఎట్టకేలకు అఘోరీ చెరలో ఉన్న శ్రీవర్షిణీని విడిపించారు పోలీసులు. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. దీంతో ఆమెను గుజరాత్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. శ్రీవర్షిణీని తల్లిదండ్రులు మంగళగిరి పీఎస్‌లో చేసిన ఫిర్యాదు వేరకు వాళ్ల కోసం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
ఉత్కంఠకు తెరపడింది. కొంతకాలంగా అఘోరీ చెరలో ఉన్న శ్రీవర్షిణీకి విముక్తి లభించింది. ఎట్టకేలకు అఘోరీ చెరలో ఉన్న శ్రీవర్షిణీని విడిపించారు పోలీసులు. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. దీంతో ఆమెను గుజరాత్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. శ్రీవర్షిణీని తల్లిదండ్రులు మంగళగిరి పీఎస్‌లో చేసిన ఫిర్యాదు వేరకు వాళ్ల కోసం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. శ్రీవర్షిణి పేరెంట్స్ సైతం పోలీసులతో గుజరాత్ వెళ్లారు. అక్కడ ఓ పెట్రోల్ బంక్‌లో నిద్రిస్తున్న వాళ్లిద్దరిని అర్థరాత్రి పట్టుకున్నారు పోలీసులు. లేడీ అఘోరీ దగ్గర ఉన్న శ్రీవర్షిణీని అదుపులోకి తీసుకొని గుంటూరుకి తరలించారు. ఆ ఘటనను లేడీ అఘోరీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమను బలవంతంగా విడదీస్తున్నారని మండిపడింది. ఇకపై శ్రీవర్షిణికి ఏం జరిగినా తనకు సంబంధం లేదని అఘోరీ చెప్పింది.
అయితే, కొద్దీ రోజుల క్రితం ఇంట్లో నుండి అఘోరీ వద్దకు వెళ్ళిపోయింది శ్రీ వర్షిణి. అఘోరి మాయలో పడి శ్రీవర్షిణి జీవితం పాడు చేసుకుంటోందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురును అఘోరీ కిడ్నాప్ చేసిందంటూ ఆమె ఫ్యామిలీ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
అయితే శ్రీవర్షిణి బ్రదర్ విష్ణు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. శ్రీ వర్షిణి కేర్ టేకర్‌గా చెప్పుకుంటున్నారు విష్ణు. అయితే అంతకుముందు అఘోరీకి శ్రీవిష్ణు.. తన సోదరిని వర్షిణిని పరిచయం చేశారు. ఇప్పుడు అతడి వ్యవహార శైలి అనుమానాస్పదంగా మారింది
Also read
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్‌ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి





