SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు.. మరోసారి ఉలిక్కిపడ్డ విజయనగరం.. ఏం జరిగిందంటే?



తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయనగరం పేలుళ్ల కుట్రకేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్ ఐ ఏ. దేశవ్యాప్తంగా ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అణచివేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం ISIS కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారంతో ఎన్ఐఏ ఎనిమిది రాష్ట్రాల్లో ఏక కాలంలో పెద్దఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.


విజయనగరం పేలుళ్ల కుట్రకేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్ ఐ ఏ. దేశవ్యాప్తంగా ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అణచివేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం ISIS కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారంతో ఎన్ఐఏ ఎనిమిది రాష్ట్రాల్లో ఏక కాలంలో పెద్దఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడులు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో 16 ప్రాంతాల్లో ఒకేసారి జరిగాయి. స్థానిక పోలీసుల సహకారంతో ముందస్తు ప్రణాళిక వేసి ఈ దాడులు విజయవంతంగా పూర్తి చేశారు.


ఈ దాడుల్లో పలు కీలక డిజిటల్ పరికరాలు, పత్రాలు, నగదు, అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం పోలీసులు జూలై 2025లో కేసు నమోదు చేసిన తర్వాత ఈ దర్యాప్తు మొదలైంది. ఆ సమయంలో సిరాజ్ ఉర్ రహ్మాన్ అనే వ్యక్తిని విజయనగరం టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో సిరాజ్ ప్రభుత్వం పై యుద్ధానికి కుట్ర చేస్తున్నట్టు వెల్లడించాడు. సిరాజ్ సమాచారంతో హైదరాబాద్ లో సయ్యద్ సమీర్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు.

ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికల ద్వారా యువతను తమ జిహాదీ భావజాలంతో లోబరుచుకొని ఉగ్రవాద మార్గంలో నడిపిస్తున్నట్టు బయటపడింది. ఆ తరువాత ఆగస్టు 27న అరీఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ అనే కీలక నిందితుడిని అరెస్టు చేశారు ఎన్ ఐ ఏ అధికారులు. అతను విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుబడ్డాడు. నెపాల్ సరిహద్దు మార్గంలో ఆయుధాల సరఫరాకు ప్రయత్నించినట్టు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఈ కేసు భారతీయ న్యాయ సంహిత 2023, ఎక్స్‌ప్లోసివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1908, యూఏ(పి) యాక్ట్ కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.


ఎన్ఐఏ అధికారులు చేపట్టిన ఈ దాడులు దేశంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను చేధించడానికి ఒక కీలక పరిణామంగా భావించవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ దాడులు జరిగిన నేపథ్యంలో విజయనగరం జిల్లావాసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. జిల్లాలో ఇంకా ఎవరైనా సిరాజ్ అనుచరులు ఉన్నారా? ఎన్ ఐ ఏ ఆ దిశగా దర్యాప్తు చేస్తుందా? అన్న వార్తలు చక్కర్లు కొట్టడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.

Also read

Related posts

Share this