సాధారణంగా దొంగతనం జరిగిన చోట.. ఏవైనా ఫింగర్ ప్రింట్స్ లేదా ఇతర క్లూస్ కోసం పోలీసులు సెర్చ్ చేస్తుండటం కామన్. అయితే ఇక్కడ ఓ దొంగ అత్యంత అనూహ్యంగా ఓ చిన్న క్లూతో పోలీసులకు దొరికిపోయాడు. అదేంటంటే ఈ వార్త చూసేయండి.
కొన్నిసార్లు నేరం జరిగిన చోట లభించే చిన్న క్లూ నిందితుడిని పోలీసులకు పట్టిస్తుంది. నేరస్తుడి వేలిముద్రలు, సీసీ కెమెరా ఫుటేజ్, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఇలా చాలా అంశాలు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా శోధించి కేసును సాల్వ్ చేస్తారు. కానీ ఈ కేసులో నిందితుడి వేసుకున్న కొత్త చెప్పులు అతడిని కటకటాల వెనక్కినెట్టాయి. అవ్వడానికి పాత నేరస్తుడే అయినా రోజుల వ్యవధిలోనే దొరికిపోయాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా పోలవరం పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. పోలవరం జగన్నాథునిపేటలో ఒక ఇంట్లో 29.43 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, నగదు చోరికి గురైయ్యయి. పాత నేరస్తులు ఎవరైనా చోరి చేసారా అనే కోణంలో సీసీ కెమెరాలు పరిశీలించారు పోలీసులు. పోలవరానికి సంబంధించిన పాత నేరస్తుడు అరగంట వ్యవధిలో ఆ ప్రాంతాలకు వచ్చి వెళ్ళినట్టు కదలికలు గుర్తించారు. దీంతో చోరి జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు, పాదముద్రలు సేకరించారు. వాటిని పరిశీలించి పాత నేరస్తుడు గంగాజలం చోరి చేసినట్టు గుర్తించారు. కానీ నిందితుడు తనకు సంబంధం లేదని చాలా రోజుల పాటు బుకాయించాడు. అయితే చోరీ చేసిన రోజు నిందితుడు తొడిగిన కాలి చెప్పులు కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ చెప్పులు కొత్తవి. దాంతో ఆ చెప్పులు ఎక్కడ కొనుగోలు చేసారో స్థానికంగా దుకాణాలు వద్ద ఎంక్వైరీ చేసారు. రాజమహేంద్రవరంలో ఆ చెప్పులు ఫలానా షాపులో కొనుగోలు చేసి ఉండొచ్చని స్థానిక షాపుల వాళ్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు ఆ షాపునకు వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించారు. అక్కడ గంగాజలం చెప్పులు కొనుగోలు చేసినట్టు వీడియో రికార్డు అయ్యింది. గంగాజలంను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు పోలీసులు. కోడిపందాలు, జూదం కోసం దొంగతనం చేసినట్టు పోలీసుల విచారణలో తెలిపాడు నిందితుడు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!