SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: చిన్నారి ఏడుపు విని ఏమైందా అని చూసారు.. పాపం తల్లి కోసం ఆ చిట్టితల్లి..!


అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.. రూప అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చంకలో రెండేళ్ల కుమార్తె ఎత్తుకుని ఉరి వేసుకుంది. ఉరి బిగుసుకున్న తరువాత కింద పడింది చిన్నారి.. ఆ తర్వాత గుక్కపట్టి తీవ్రంగా ఏడుస్తుండడంతో స్థానికులు వెళ్లి చూశారు. దీంతో ఊరితాడుకు వేలాడుతూ కనిపించింది ఆమె. ఈ విషాదకర ఘటన అనకాపల్లి పరిధిలోని ఎలమంచిలిలో జరిగింది. ఎలమంచిలిలోని దిమిలిరోడ్డు సమీపంలో పాతవీధికి చెందిన రాజు కాయగూరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు భార్య జి.రూప.. మూడున్నరేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు.


అయితే.. ఏమైందో ఏమో కానీ.. సోమవారం రాత్రి మేడపై గదిలోకి వెళ్లిన రూప.. కుమార్తెను చంకలో పెట్టుకొని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉరి మెడకు బిగుసుకున్నాక రూప చేతిలోంచి బిడ్డ జారి కాళ్లవద్ద పడింది. ఆ తర్వాత ఏడవడం ప్రారంభించింది. ఈ ఏడుపు విని స్థానికులు మేడపైకి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది రూప. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలసివేసింది.

అనంతరం ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరవాడ డీఎస్పీ.. స్థానిక పోలీసులతో కలసి ఘటనాస్థలానికి చేరుకొని సీన్ ఆఫ్ అఫెన్స్ ను పరిశీలించారు. వివరాలను సేకరించి కుటుంబ సభ్యులను విచారించారు. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని రూప తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this