రెండేళ్ల పాప.. అప్పటివరకు ఇంటి బయట ఆడుకుంది. అంతలోనే మిస్సయింది. ఎంత వెతికినా ఆచూకి లేదు. ఎవరైనా కిడ్నాప్ చేశారా అని అంతా కంగారుపడ్డారు. బిడ్డ కనిపించకపోవడంతో పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు పాపను గంటల వ్యవధిలోనే కనిపెట్టారు పోలీసులు. అసలు ఏం జరిగింది…? పాపను కిడ్నాప్ చేశారా..? తప్పిపోయిందా…?
విశాఖ పెందుర్తి సుజాతనగర్‌లో కలకలం చెలరేగింది. అప్పటివరకు ఇంటికి సమీపంలోనే ఆడుతూ కనిపించిన రెండేళ్ల పాప రుగ్విజశ్రీ.. అంతలోనే అదృశ్యమైంది. చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించలేదు. కిడ్నాప్ జరిగి ఉంటుందని పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. , స్థానికులు సైతం అదే అనుమానం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. అర్ధరాత్రి వరకు 6 బృందాలు విస్తృతంగా గాలించాయి. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా పాపను ట్రాకింగ్ చేశారు. ఏ సమయంలో మిస్ అయింది.. ఎటువైపు వెళ్లిందో తెలుసుకున్నారు. ఆపై పాప వెళ్లిన ప్రాంతంవైపు డ్రోన్ ఎగరేయడంతో మిస్టరీ వీడింది.
డ్రోన్ సహకారంతో ఇంటి వెనుక వైపునే చిన్నారి ఆచూకి గుర్తించారు పోలీసులు. ఇంటి వెనుక వైపు చెరువు బురదలో పాప కూరుకుపోయి.. బయటకు రాలేకపోయింది. తనను డ్రోన్ ద్వారా గుర్తించిన పోలీసులు వెంటనే వెళ్లి రెస్క్యూ చేశారు. ఆపై ఆస్పత్రికి తరలించారు. పాప కనిపించకపోయేసరికి కంగారుపడ్డామంటున్నాడు తండ్రి. డ్రోన్ల సాయంతో పోలీసులు గాలించడంతో ఆచూకీ తెలిసిందంటున్నారు. వెంటనే స్పందించి.. పాపను రెస్క్యూ చేసిన పోలీసులకు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!