March 16, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: పిల్లాడనే కనికరం లేకుండా పోయింది.. కుక్కల గొలుసుతో కట్టేశారు..!

 

మనుషులలో రాను రాను మానవత్వం మంటగలుస్తోంది. తాజాగా మరో ఘటన నిడమర్రులో వెలుగు చూసింది. జంతువులలో సైతం తమ తోటి జంతువులకు ఎవరైనా హాని తలపెడితే అవి అన్ని కలిసి సమిష్టిగా పోరాడుతాయి. కానీ మనుషులలో మాత్రం ఏమాత్రం జాలి దయ ఉండడం లేదు. కనీసం చిన్నపిల్లలనే విషయం మరిచి ప్రవర్తించడం మనిషి విలువలను దిగజార్చుతున్న పరిస్థితి

విచక్షణ మనిషిని కొన్నిసార్లు ఉన్నతమైన వ్యక్తిగా మల్చితే, మరికొన్ని సార్లు పతనానికి కారణమవుతుంది. పక్షులు, మూగ జీవులు , అభంశుభం, పాపపుణ్యం తెలియని పిల్లలు ఉద్దేశ్యపూర్వకంగా తప్పులు చేయరు. కానీ విచక్షణ ఉండి, వయస్సు వచ్చిన వ్యక్తులు సైతం అమానవీయం గా ప్రవర్తించటం సమాజంలో చాలా సార్లు వెలుగు చూస్తున్నాయి. ఒక పిల్లవాడు తప్పు చేశాడని అతడిని కుక్కను కట్టేసి గొలుసులతో బంధించేసిన ఘటన ఏలూరు జిల్లాలో కలకలం రేపుతోంది.

మనుషులలో రాను రాను మానవత్వం మంటగలుస్తోంది. తాజాగా మరో ఘటన నిడమర్రులో వెలుగు చూసింది. జంతువులలో సైతం తమ తోటి జంతువులకు ఎవరైనా హాని తలపెడితే అవి అన్ని కలిసి సమిష్టిగా పోరాడుతాయి. కానీ మనుషులలో మాత్రం ఏమాత్రం జాలి దయ ఉండడం లేదు. కనీసం చిన్నపిల్లలనే విషయం మరిచి ప్రవర్తించడం మనిషి విలువలను దిగజార్చుతున్న పరిస్థితి.

ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో ఓ మైనర్ బాలుడిపై జరిగిన అమానుష ఘటన వెలుగు చూసింది.. బాలుడు అనే కనికరం ఏమాత్రం లేకుండా అతనిని కొట్టి ఆ తర్వాత, కుక్కలను కట్టేసే గొలుసుతో ఆ బాలుడిని కట్టి హింసించారు కొందరు వ్యక్తులు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. క్రోవ్విడి గ్రామానికి చెందిన అనే వ్యక్తి బుజ్జి కుమారుడు బావాయి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం పాఠశాల ముగిసిన తరువాత కొల్లేరులో ఉన్న తన తండ్రి వద్దకు మైనర్ బాలుడు బయలుదేరాడు.

అయితే క్రొవ్విడి గ్రామానికి చెందిన వెంకన్న, పాండు అనే ఇద్దరు వ్యక్తులు ఆ మైనర్ బాలుడిని పట్టుకున్నారు. కొల్లేరు ఐదవ కాంటూరు పరిధిలో జిరాయితీ భూముల్లో ఉన్న చేపల చెరువులలో చేపలు పట్టాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలుడిని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఆ బాలుడిని కుక్కను కట్టేసే గొలుసు తీసుకుని ఆ బాలుడి కాలుకి కట్టి బంధించారు. విషయం తెలుసుకున్న తాత మేనమామ వెంకన్న, పాండు వద్దకు వెళ్లి బంధించిన అతనిని విడుదల చేయమని కోరారు. అయితే వారి మాటలు ఏమాత్రం లెక్కచేయకుండా బాలుడిని అలాగే గొలుసుతో కట్టి అక్కడే ఉంచారు.

బాలుడి తాత, మేనమామ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లి, పిల్లాడిని రక్షించమని కోరారు. దాంతో గ్రామ పెద్దలు పాండు, వెంకన్నలను మందలించి బందీగా ఉన్న బాలుడని విడిపించారు. అయితే విషయం రెండు రోజులు పాటు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. బాలుడిపై అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతుండగా, కొల్లేరులో కట్టుబాట్లు ఉండటంతో పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Also read

Related posts

Share via