చనిపోయిన తండ్రి సమాధి దగ్గర పూజలు చేయాలని గ్రామానికి చేరుకున్న గిరి ఊరి సమీపంలోనే ఉన్న పాడుబడ్డ బావి దగ్గర ఆగాడు. ఆ తర్వాత భార్య, ఇద్దరు పిల్లలను.. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుపతి జిల్లా పాకాల మండలంలో దారుణం జరిగింది. మద్దినాయినపల్లె ఎస్సీ కాలనీకి చెందిన గిరి.. భార్య, బిడ్డలను బావిలోకి తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఉపాధి కోసం తిరుపతిలో ఉంటున్న గిరి ఎలక్ట్రీషియన్‌గా పని చేసుకుంటూ.. కపిల తీర్థం వద్ద కూల్ డ్రింక్ షాప్ కూడా నిర్వహిస్తున్నాడు. ఇదంతా బాగున్నా కుటుంబంలో కలహాలతో ఏకంగా భార్య పిల్లలనే వదిలించుకోవాలనుకున్నాడు. కారణాలు ఏమో తెలియదు కానీ చంపేందుకు మాత్రం పక్కా ప్లాన్ వేశాడు. సొంతూరు మద్దినాయనపల్లికి భార్యా పిల్లలను స్కూటీపై తీసుకొచ్చిన గిరి అనుకున్న ప్లాను ఆచరణలో పెట్టాడు. 2012 లో చనిపోయిన తండ్రి సమాధి వద్ద పూజలు చేయాలని గ్రామానికి చేరుకున్న గిరి.. ఊరి సమీపంలోనే ఉన్న పాడుబడ్డ బావి దగ్గర ఆగాడు. అక్కడ భార్య 31 ఏళ్ల హేమంత కుమారి, 12 ఏళ్ల తనుశ్రీ, 8 ఏళ్ల తేజశ్రీ లను అక్కడ దింపేసి సైకోలా వ్యవహరించాడు.
ఉన్నపళంగా భార్య ఇద్దరు బిడ్డల్ని బావిలోకి తోసేసాడు. భార్యాబిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారని కట్టుకథ అల్లే ప్రయత్నం చేశాడు. ఈ లోపు చుట్టుపక్కల పొలాల్లో ఉన్నవాళ్లు చూడడంతో డామిట్ కథ అడ్డం తిరిగిందనుకున్నాడు. అక్కడ ఉన్న స్థానికులు బావి దగ్గరికి చేరుకోవడంతో ఏం చేయాలో తెలియక కొత్త నాటకానికి తెర తీశాడు. స్కూటీ తాళాల ను ఆయుధంగా మార్చుకొని గొంతు కోసుకొని సూసైడ్ అటెంప్ట్ కు ప్రయత్నం చేశాడు. బావిలో నుంచి భార్య హేమంత కుమారి, పెద్ద కూతురు తనుశ్రీ డెడ్ బాడీలను బయటకు తీసి గట్టుపై ఉంచి చుట్టుపక్కనున్న పశువుల కాపరులు పొలం పనుల్లో ఉన్నవాళ్లు.. చిన్న కూతురు తేజశ్రీ డెడ్ బాడీ గుర్తించేందుకు విశ్వప్రయత్నం చేసారు.
ఈలోపు సమాచారం అందుకున్న పాకాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి బావిలో ఉన్న మూడో మృతదేహాన్ని బయటకు తీశారు. గిరి గొంతు కోసుకోవడంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు హేమంత కుమారి, తనుశ్రీ, తేజశ్రీ డెడ్ బాడీలను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పాకాల పోలీసులు గిరిని అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ కేస్ నమోదు చేసారు. గిరికి మతిస్థిమితం లేదని కొందరు గ్రామస్తులు చెబుతున్నా.. పోలీసులు మాత్రం పక్కా ప్లాన్‌తోనే గిరి.. భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు.
Also read
- మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..
- Crime news: భర్తని చంపి.. డోర్ డెలివరీ చేసిన భార్య, బంధువులు
- Gandikota Inter Girl: ‘అన్నా ప్లీజ్ నన్ను వదిలేయ్’.. గండికోట యువతి హత్య కేసులో విస్తుపోయే విషయాలు!
- love couple : ఇప్పటికిప్పుడే.. నన్ను పెళ్లి చేసుకుంటావా? లేక చావామంటావా? ఇదేం సైకో లవ్‌రా నాయనా?
- Atmakur Forest Scam: ఆత్మకూరు ఫారెస్ట్ కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. కోట్లకు కోట్లే గుటకాయ స్వాహా!