గతంలో అప్పటికే పెళ్లైన విషయం దాచి.. మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడో ప్రబుద్ధుడు. చివరికి పెళ్లి పీటలపై కూర్చుని మరి కాసేపట్లో ముహుర్తం ఉందనగా.. ఉన్నట్లుండి పెళ్లి కొడుకు మాయమయ్యాడు. దీంతో పెళ్లింట కలకలం రేగింది. కాసేపటికే మరో షాకింగ్ న్యూస్ పెళ్లివారికి అదిందింది..
దేవరపల్లి, ఆగస్ట్ 10: ఓ ప్రబుద్ధుడు చేసిన పనికి ఊరుఊరంతా నోరెళ్ల బెట్టింది. గతంలో అప్పటికే పెళ్లైన విషయం దాచి.. మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. చివరికి పెళ్లి పీటలపై కూర్చుని మరి కాసేపట్లో ముహుర్తం ఉందనగా.. ఉన్నట్లుండి పెళ్లి కొడుకు మాయమయ్యాడు. దీంతో పెళ్లింట కలకలం రేగింది. కాసేపటికే మరో షాకింగ్ న్యూస్ పెళ్లివారికి అదిందింది. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరారయ్యాడనే వార్త విని అంతా షాకయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన వధువు తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విచిత్ర ఘటన తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం (ఆగస్టు 11) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలుకి చెందిన పాలి సత్యనారాయణకు గోపాలపురం మండలం భీమోలుకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. వీరికి సోమవారం (ఆగస్ట్ 11) తెల్లవారుజామున వివాహం జరిపేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లి పనులు కూడా పూర్తయ్యాయి. మరికాసేపట్లోనే పెళ్లి తంతు ప్రారంభంకానుంది. కానీ ఇంతలో ఆదివారం రాత్రి హఠాత్తుగా పెళ్లి కొడుకు కనిపించడం లేదనే వార్త పెళ్లింట దావానంలా పాకింది.
ఈ విషయం వధువు తరఫు బంధువులకు చేరడంతో వారికి అనుమానం వచ్చి దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ భర్త చనిపోయిన ఓ మహిళతో సత్యనారాయణకు ఐదేళ్ల కిందటే వివాహమైనట్లు పోలీసులకు తెలిపారు. ఆమె కుమార్తెకు కూడా సత్యనారాయణే వివాహం జరిపించాడని తెలిపారు. ఆదివారం సదరు మహిళ ఫోన్ చేసి కేసు పెడతానని బెదిరించడంతో ఆమెతో కలిసి వరుడు పరారయ్యాడని వధువు తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెళ్లి కుమార్తెకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కేసు వివరాలను సీఐ బి.నాగేశ్వర నాయక్ వెల్లడించారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025