SGSTV NEWS
Andhra PradeshViral

Viral Video: పామాయిల్ తోటలో వింత శబ్దాలు.. ఏంటోనని చూస్తే.. వామ్మో ఒళ్ళు జలదరించింది..!

అది అనకాపల్లి జిల్లా మాడుగుల – సాగరం రహదారి… ఆ పక్కనే పామ్ ఆయిల్ తోట.. అటుగా వెళుతున్న వారు హడలెత్తిపోయారు. మెరుపు వేగంతో రోడ్డు దాటింది ఓ భారీ పాము. పామాయిల్ తోటలోకి సర్రున వెళ్ళిపోయింది. దాంతో అక్కడే ఉన్న కూలీలు.. తీవ్ర భయాందోళన గురయ్యారు. అసలేం జరిగిందంటే.. మాడుగుల మండలం సాగరం గ్రామంలో పామాయిల్ తోట ఉంది. కూలీలందరూ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో భారీ గిరి నాగు పామాయిల్ తోటలో చేరింది. దాదాపు 12 అడుగుల వరకు ఆ పాము ఉంటుంది. అక్కడే పామాయిల్ కోస్తున్న కూలీలు.. ఆ పాము హై స్పీడ్ లో తోటలోకి దూసుకెళ్లడంతో భయాందోళనకు గురయ్యారు.

అది వేరే పామును వేటాడుతూ వెంటాడుతూ.. హై స్పీడ్ లో దూసుకెళ్లింది. లోపల పొదల్లోకి వెళ్లి వింత వింత శబ్దాలు చేస్తోంది. దీంతో తీవ్ర భయాందోళన కూలీలు.. తోట యజమానికి సమాచారం అందించారు. వెంటనే స్థానిక స్నేక్ కేచర్ వెంకటేష్ కి విషయాన్ని చెప్పారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

వీడియో చూడండి..


దీంతో రంగంలోకి దిగిన స్నేక్ కేచర్.. 12 అడుగుల భారీ గిరి నాగును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నాడు. పట్టుకునే సమయంలో ఆ పాము ఒక్కసారిగా ఎదురు తిరిగే ప్రయత్నించం చేసింది. ఈ క్రమంలో చాకచక్యంగా వ్యవహరించి ఆ పామును బంధించాడు వెంకటేష్.. అనంతరం అటవీ సిబ్బంది సమక్షంలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also read

Related posts

Share this