SGSTV NEWS
Andhra PradeshCrime

విశాఖలో చోరీ.. మలక్ పేటలో హత్య..! తీగ లాడితే కదిలిన నేర చరిత్ర..



విశాఖపట్నం షీలా నగర్ ఎల్ఐసి ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ కేసులో కీలక ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ చోరీ పాల్పడించి ముగ్గురు పాత నేరస్తులు. వీరు కిలో బంగారంతోపాటు రూ.20 లక్షల వరకు ఎత్తుకుపోయారు. జులై 12వ తేదీ అర్ధరాత్రి చోరీ చేసి కేటుగాళ్లు.. హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడ మరి కొంతమందితో కలిసి ఈ నెల 15న చందు నాయక్ అనే వ్యక్తిని హత్య చేశారు. ఆ కేసులో కూపీ లాగితే విశాఖ చోరీ కేసు చిక్కుముడి వీడింది..

విశాఖపట్నం, జులై 20: విశాఖపట్నం షీలా నగర్‌లో ఈనెల 12 అర్ధరాత్రిభారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. వెంకటేశ్వర కాలనీలోని ఎల్ఐసీ ఉద్యోగి శ్రీనివాస్ ఇంట్లోకి చొరబడిన దొంగలు.. కోటి విలువైన కిలో వరకు బంగారం, 3 కిలోల వెండి, రూ.20 లక్షల నగదు, ఏడు వాచీలు, పెళ్లి పట్టు చీరలు ఎత్తుకెళ్లారు. చోరీ సమయంలో ఆ ఫ్లోర్ లోనే ఉన్న మిగతా మూడు ఫ్లాట్ల తలుపులకు బయట నుంచి గడియ పెట్టేసారు దొంగలు. శ్రీనివాస్ కుమార్తెకు అక్టోబర్లో వివాహం ఉన్నందున ఆభరణాల తయారీకి బంగారం, వెండి లాకర్ నుంచి తెచ్చి ఇంట్లో పెట్టినట్లు బాధితులు తెలిపారు. ఫ్లాట్ డోర్లు కిటికీలకు పాలీషింగ్ చేయిస్తున్నారు. వాసన వస్తోందని.. అపార్ట్మెంట్ కింద ఫ్లోర్లో తెలిసన వాళ్లింట్లో నిద్రించడానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకొన్న దొంగలు అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి.. చేతివాటం చూపించారు. ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లకూ బయట నుంచి గడియ వేసి చోరీకి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారురు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. ముగ్గురు దొంగల ముఠా ఈ పని చేసినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. చోరీ అనంతరం నిందితులు షీలా నగర్ నుంచి దువ్వాడ ఆ తర్వాత అనకాపల్లి వైపు వెళ్లినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

మలక్ పేటలో హత్య..
జులై 15న మలక్ పేటలో సీపీఐ నేత చందు నాయక్ హత్య జరిగింది. వాకింగ్‌కు వెళ్లిన చందు యాదవ్‌పై కాల్పులు జరిపి హత మార్చారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు క్లూస్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాలు, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా జులై 18న నెల్లూరు జిల్లా కావలిలో అర్జున జ్ఞాన ప్రకాశ్, రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు ఉన్నట్లు గుర్తించారు. జులై 19న రాజేశ్, ప్రశాంత్, ఏడుకొండలును జనగామ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. పట్టుబడ్డ నిందితుల వద్ద భారీగా బంగారం, నగదు ఉండడంతో విచారించేసరికి విశాఖ చోరీ కేసు లింకు బయటపడింది. చందు నాయక్ హత్య కేసులో అర్జున జ్ఞాన ప్రకాశ్, రాంబాబు.. విశాఖ చోరీ కేసులో నిందితులుగా ఉన్నారు. ఈనెల 12 అర్ధరాత్రి.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతానికి చెందిన పాత నేరస్థుడు నగేష్, నెల్లూరు ప్రాంతానికి చెందిన జ్ఞాన ప్రకాష్, రాంబాబు కలిశారు. ముగ్గురు కలిసి షీలానగర్‌లోని ఇంట్లో చోరీ చేశారు. ఆ సమయంలో అదే ఫ్లోర్లో ఉన్న మిగతా ఫ్లాట్ల తలుపులకు బయట నుంచి గోళ్లెం పెట్టేసారు. అర్ధరాత్రి 12:30 కు అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన ఈ ముగ్గురు దొంగలు.. గంటపాటు అక్కడే ఉండి పని ముగించుకుని ఒంటి గంటకు తిరిగి బైక్‌పై పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.


కాకినాడ జైల్లో కలుసుకున్న ఆ ముగ్గురు..
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతానికి చెందిన చిటికెల నాగేశ్వరరావు పాత నేరస్థుడు. కాకినాడ జైల్లో నెల్లూరుకు చెందిన నగేష్‌కు జ్ఞాన ప్రకాష్, రాంబాబుకు పరిచయమయ్యాడు. ముగ్గురు కలిసి విశాఖలోని షీలా నగర్‌లో ఇంటిని కొల్లగొట్టారు. ముగ్గురు వాటాలు వేసుకోగా నగేష్ లోకల్ గానే ఉండిపోయాడు. జ్ఞాన ప్రకాష్, రాంబాబు హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడ మిగతా సుఫారీ సుచ్చుకుని జులై 15వ తేదీ ఉదయాన్నే మలక్‌పేటలో చందు నాయక్ హత్యలో ఈ ఇద్దరు పాల్గొన్నారు. కారుపై పోలీసులకు లభించిన జ్ఞాన ప్రకాష్ ఫింగర్ ప్రింట్ సాయంతో పోలీసులు సులువుగా నిందితులను ట్రాక్ చేయగలిగారు. విశాఖలో భారీ చోరీ చేసిన నిందితులే.. హైదరాబాద్ మలక్‌పేట మర్డర్ కేసులో సభ్యులుగా ఉండడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది

Also read

Related posts

Share this