SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: లేడీస్ హాస్టల్‌లో అర్థరాత్రి ఘోరం.. ముక్కుకి క్లిప్.. నోటికి ప్లాస్టర్‏తో యువతి..


గుంటూరు జిల్లా అశోక్‌నగర్‌లో విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.. ఏలూరుకు చెందిన కావ్య ముక్కుకి క్లిప్ పెట్టి.., నోటికి ప్లాస్టర్ వేసుకుని సూసైడ్‌ చేసుకుంది. అశోక్‌నగర్‌లోని లేడీస్‌ హాస్టల్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కావ్య నిన్న రాత్రి చివరిసారిగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడింది.

గుంటూరు జిల్లా అశోక్‌నగర్‌లో విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.. ఏలూరుకు చెందిన కావ్య ముక్కుకి క్లిప్ పెట్టి.., నోటికి ప్లాస్టర్ వేసుకుని సూసైడ్‌ చేసుకుంది. అశోక్‌నగర్‌లోని లేడీస్‌ హాస్టల్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కావ్య నిన్న రాత్రి చివరిసారిగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడింది. అయితే, తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందనే విషయంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. శ్రావ్య VVIT కాలేజ్ లో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే.. ఆమె బలవన్మరణానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది..

ఇదిలాఉంటే.. కావ్యది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కావ్య ఆత్మహత్యకు కారణం ఏంటన్న దానిపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.. ఇంజినీరింగ్ విద్యార్దిని శ్రావ్య ఆత్మహత్య ఘటనపై విచారణ చేస్తున్నామని.. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రూమ్మేట్‌తో తనకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందని శ్రావ్య చెప్పినట్లు విచారణలో తేలిందన్నారు. నోటికి ప్లాస్టర్, ముక్కుకు‌ క్లిప్ పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. సాధారణంగా ఇలా ఆత్మహత్య చేసుకోవడం కష్టం.. కానీ శ్రావ్య అలాగే ఆత్మహత్య చేసుకుందని.. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది

Also read

Related posts