అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉరవకొండ పట్టణం శిరిడి సాయి నగర్‌లో గ్యాస్ గీజర్‌లో మంటలు వ్యాపించి వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. స్నాం చేయడానికి బాత్రూంలోకి వెళ్లిన వృద్ధురాలికి మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఉరవకొండ పట్టణంలోని శిరిడి సాయి నగర్ లో నివాసం ఉంటున్న నారాయణమ్మ అనే వృద్ధురాలు బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లింది. అయితే గ్యాస్ గీజర్ ను ఆన్ చేయగా ప్రమాదవశాత్తు అందులో నుంచి మంటలు చెలరేగడంతో తీవ్రంగా గాయపడింది. మంటలు చెలరేగి ఒక్కసారిగా వృద్ధురాలి ఒంటికి మంటలు అంటుకున్నాయి. కింద పడిపోయిన వృద్ధురాలు నారాయణమ్మను మంటల నుంచి కాపాడే ప్రయత్నం చేసింది ఇంట్లోని పనిమనిషి.
చివరికి ఇరుగుపొరుగు వారి సాయంతో తీవ్రంగా గాయపడిన నారాయణమ్మను మొదట ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తుండగా నారాయణమ్మ మార్గ మధ్యలోనే మృతి చెందింది. నారాయణమ్మ కూతురు విదేశాలలో ఉండగా, కొడుకు మిర్యాలగూడలో నివాసం ఉంటున్నారు. దీంతో ఉరవకొండ పట్టణం శిరిడి సాయి నగర్ లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు నారాయణమ్మ ఇలా అగ్నికి అహుతి అయ్యింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





