March 16, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: ఏం బ్రాండ్ తాగావ్ అన్న.. బస్సు టైర్పై పడుకుని 15 కిలోమీటర్లు ప్రయాణం



ఈ అన్న ఫుల్‌ తాగాడు. మరి చార్జీకి డబ్బులు లేవో.. ఎండకి చల్లగా ఉంటుంది అనుకున్నాడో.. ఓ ఆర్టీసీ బస్సు కింద ఉండే స్పేర్ టైర్‌పై పడుకున్నాడు. అలా ఏకంగా 15 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అయితే ఇతగాడ్ని బస్సు వెనుక వస్తున్న ద్విచక్రవాహనదారులు గమనించారు.


ఎవరైనా బస్సులో కూర్చోని ప్రయాణిస్తున్నారు.. ఆ పోని సీట్లు లేవంటే.. నిల్చోని ప్రయాణిస్తారు. కానీ ఇతగాడు డిఫరెంట్. ఏకంగా బస్సు కింద వేలుడుతూ 15 కిలోమీటర్లు ప్రయాణించాడు. నిజమండీ బాబు. అందుకు కారణం మందేసిన మత్తులో ఉండటమే. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు నుంచి హిందూపురం వెళ్లే RTC బస్సులో ఓ మందుబాబు ఊహించని విధంగా ప్రయాణించాడు. ఆర్టీసీ బస్సు వెనుక టైర్ పక్కనే ఉండే స్పేర్ టైర్ ఎక్కి ఎంచక్కా పడుకున్నాడు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఇలానే ట్రావెల్ చేశాడు.




మార్గమధ్యలో రాంపురం వద్ద బస్సు కింద ఎవరో వేలాడుతున్నట్లు వెనుక బైక్‌పై వస్తున్న వాళ్లు గమనించారు. విషయం డ్రైవర్‌కు చెప్పి బస్సును వెంటనే ఆపించారు. తర్వాత ఆర్టీసీ డ్రైవర్ బస్సు కింద ఏముందో అని చూడగా ఫుల్ మందు కిక్కులో ఉన్న ఓ వ్యక్తి స్పేర్‌ టైర్‌పై పడుకుని కనిపించాడు. అతడిని చూసి అవాక్కయిన బస్సు డ్రైవర్‌, మందుబాబును బస్సు కింద నుంచి బయటకు తీశారు. ఆ వ్యక్తి సోయి లేనంతగా మద్యం సేవించాడని బస్సు డ్రైవర్ చిరంజీవి తెలిపారు. అదష్టవశాత్తూ ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. బస్సు దిగిన తరువాత అతడు నడుచుకుంటూ వెళ్లిపోయాడని వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హిందూపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది

Also read

Related posts

Share via