మందుబాబులే కాదు..కొందరు భామలు కూడా మద్యం మైకంలో పబ్లిక్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి షాకింగ్ సీన్ ఒకటి గుంటూరును షేక్ చేసింది. పట్టపగలు.. నడిరోడ్డుపైన ఓ యువతి చేసిన హల్‌చల్ అంతా ఇంతా కాదు. చూస్తే మీరూ షాకవ్వాల్సిందే! ఓవర్ స్పీడ్‌తో దూసుకొచ్చిన బోలెరో వాహనం ఓ టూవీలర్‌ను ఢీకొట్టింది.
మందుబాబులే కాదు..కొందరు భామలు కూడా మద్యం మైకంలో పబ్లిక్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి షాకింగ్ సీన్ ఒకటి గుంటూరును షేక్ చేసింది. పట్టపగలు.. నడిరోడ్డుపైన ఓ యువతి చేసిన హల్‌చల్ అంతా ఇంతా కాదు. చూస్తే మీరూ షాకవ్వాల్సిందే! ఓవర్ స్పీడ్‌తో దూసుకొచ్చిన బోలెరో వాహనం ఓ టూవీలర్‌ను ఢీకొట్టింది. ఆ ధాటికి స్కూటీపై ఉన్న ఇద్దరు యువకులు దూరంగా ఎగిరిపడ్డారు. గాయాలతో బతికి బయటపడ్డారు. ఇక బోలోరో వెహికల్ మాత్రం ఏమాత్రం స్పీడ్ తగ్గకుండా స్కూటీని ఇలా ఈడ్చుకు వెళ్లింది.
బండికి బ్రేకులు ఫెయిల్ అయివుంటాయనుకున్నారు. కానీ బండిని ఆపాక తెలిసింది ఈ టక్కర్ కు కారణం లిక్కర్ రాణి అని..! ఆ రూట్‌లో వెళ్తున్న కొందరు వాహనదారులు బోలోరాను వెంబడించి ఆపేశారు. ఫుల్‌నిషాలో స్టీరింగ్‌పై వాలిన షేక్ సైదాను చూసి షాకయ్యారంతా.. దాచేపల్లిలో ఫుల్ మందు కొట్టిన ఆమె, బైపాస్ రోడ్డు మీదుగా పిడుగురాళ్లకు వస్తూ.. మద్యం మైకంలో ఓవర్ స్పీడ్‌తో స్కూటీని ఢీకొట్టింది. అంత జరిగినా కూడా సైదాకు కిక్కు ఏమాత్రం దిగలేదు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా జనంపై తిరగబడింది. పబ్లిక్ వూరుకుంటారా…! గట్టిగా నాలుగు చీవాట్లు పెట్టారు. పోలీసులను పిలిచి ఆమెను వాళ్లకు అప్పగించారు.
వీడియో చూడండి..
గాయపడిన యువకులను పోలీసులు హాస్పిటల్‌కు తరలించారు. తాగుబోతుల నిర్వాకాలు చూశాం.. కానీ మరి ఇంత అరాచకమా! అని జనం అవ్వాక్కయ్యారు. ఆమె ప్లేస్‌లో మందుబాబు ఉండివుంటే తాట తీసేవాళ్లుకదా..! మరి పీకలదాక తాగి టక్కర్ చేసిన లిక్కర్ లేడీ సైదాపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు పిడుగురాళ్ల వాసులు. దాచేపల్లికి చెందిన షేక్ సైదాను అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుగా విచారణ పట్టారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!