పండుగ పూట ఏపీలోని విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. దీపావళి పండుగను పురస్కరించుకుని 9 మంది యువకులు.. ఎంజాయ్ చేసేందుకు విశాఖ యారాడ బీచ్ దగ్గరకు వెళ్లారు.. నీళ్ల లోపలికి వద్దు.. అంటూ అక్కడున్న పోలీసులు చెప్పారు.. వినలేదు.. చాలా సార్లు చెప్పారు.. అయినా వారు వినకుండా తప్పించుకుంటూ.. నీటిలోకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు. ఇంతలోనే.. అలలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.. 9 మందిలో ఇద్దరు కెరటాల్లో కొట్టుకుపోయారు.. ఈ విషాద ఘటన విశాఖ యారాడ బీచ్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.. గల్లంతైన ఇద్దరు యువకుల కోసం అప్పటినుంచి గాలింపు కొనసాగుతోంది.. ఇప్పటివరకు వారి జాడ లభించలేదని పోలీసులు చెప్పారు.
యారడ బీచ్ దగ్గరకు వెళ్లారు 9 మంది యువకులు వచ్చారని.. ఈ క్రమంలో సముద్రంలో స్నానం చేస్తుండగా గణేష్, పవన్ కెరటాల్లో కొట్టుకుపోయారని వారి స్నేహితులు, పోలీసులు తెలిపారు. గల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.. పండుగ రోజు తమ బిడ్డలు గల్లంతవ్వడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా ఎంజాయ్ చేద్దామని బీచ్ దగ్గరకు వెళ్లిన యువకులంతా షాక్‌లో ఉన్నారు.
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





