SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: పండగరోజు ఎంత పనైంది.. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లోడు

 

శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం దొరగల్లులో దసరా రోజు విషాదం చోటుచేసుకుంది. ఆలయం వద్ద పూజ చేసేందుకు తీసుకొచ్చిన కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి ముందర ఆడుకుంటున్న ఐదేళ్ల నిఖిల్ ప్రాణాలు కోల్పోయాడు.. .. ..

శ్రీసత్యసాయి జిల్లాలో దసరా పండుగ రోజు దుర్ఘటన జరిగింది. ముదిగుబ్బ మండలం దొరగల్లులో ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. దొరగల్లులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజ చేసేందుకు బాలాజీ అనే వ్యక్తి కారు తీసుకొచ్చాడు. అయితే అప్రమత్తంగా ఉండక, బ్రేక్‌ బదులు యాక్సిలేటర్‌ను నొక్కడం వల్ల కారు అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఆ ఇంటి ముందు ఆడుకుంటున్న నిఖిల్‌ (వయసు 5 సంవత్సరాలు)ను ఢీకొట్టింది. బలమైన ఢీకొట్టడంతో బాలుడు దూరంగా పడిపోయాడు.

స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన నిఖిల్‌ను బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై ముదిగుబ్బ పట్టణ సీఐ శివరాముడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దసరా పండుగ రోజు జరిగిన ఈ విషాదం గ్రామంలో తీవ్ర ఆందోళన, విషాద వాతావరణాన్ని నెలకొల్పింది

Also read

Related posts