సైబర్ నేరగాళ్లు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సీబీఐ, ఏసీబీ పోలీసులమంటూ ఇన్నాళ్లు బెదిరించి గ్యాంగ్స్.. ఇప్పుడు సరికొత్త మార్గంలో ప్రయాణిస్తున్నాయి. వినియోగదారుల భయాన్ని ఆసరగా చేసుకుని లక్షల దండుకుంటున్నాయి. గుంటూరులో కరెంట్ బిల్లు చెల్లించకపోతే కరెంటు కట్ చేస్తామంటూ భయపెట్టి.. ఆ తర్వాత ఖాతాలోని సొమ్ము మొత్తం కాజేసిన ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి.
గుంటూరు నగరానికి చెందిన ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌కు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఒక మెసేజ్ వచ్చింది. మీరు విద్యుత్ బిల్లు చెల్లించకుంటే.. కనెక్షన్ కట్ చేస్తామని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. కొద్దిసేపటి తర్వాత మీ కనెక్షన్ తొలగించకుండా ఉండాలంటే ఈ విద్యుత్ అధికారి నెంబర్‌కు ఫోన్ చేయాలంటూ మరొక సందేశాన్ని పంపించారు. దీంతో ఆ వ్యక్తి వెంటనే ఆ అధికారికి నెంబర్‌కు ఫోన్ చేశాడు. అయితే ప్రస్తుతం ఇరవై రూపాయలు చెల్లిస్తే విద్యుత్ కనెక్షన్ తొలగించమని.. వెంటనే తాను పంపే లింక్ నుంచి ఇరవై రూపాయలు పే చేయాలని ఆ అధికారి చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఇరవై రూపాయలే కదా అంటూ ఆ లింక్ ఓపెన్ చేసి ఇరవై రూపాయలు చెల్లించాడు. దీంతో తన కరెంట్ పోలేదనుకుంటూ రాత్రి గడిపాడు.
అయితే తాను చేసిన పొరపాటు గురించి తర్వాత తెలుసుకున్నాడు. ఆ లింక్ స్క్రీన్ షేరింగ్ అని.. ఎప్పుడైతే ఆ లింక్ ద్వారా తాను ఇరవై రూపాయలు పంపించాడో.. అప్పుడే తన ఫోన్ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయిందని గ్రహించాడు. తన ఖాతాల్లోని రెండు లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచుకోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అయితే తన వివరాలను బయటపెట్టవద్దని సదరు వ్యక్తి విజ్ఞప్తి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇతర నెంబర్ల నుంచి లింక్ వస్తే వాటిని ఓపెన్ చేయవద్దని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల వివిధ పద్దతుల్లో దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అయితే విద్యుత్ కనెక్షన్ తొలగింపుంటూ ఆడుతున్న నాటకాన్ని కొత్తగా చూస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఇటువంటి లింక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!