SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: ఆడుకుందామని పొద్దున్నే గ్రౌండ్‌కి వెళ్లిన పిల్లలు – కనిపించింది చూసి షాక్




శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులో గీతామందిరం సమీపంలో, బస్టాండు వద్ద వరుస క్షుద్రపూజల కలకలం చెలరేగింది. నిమ్మకాయలు, కోడి గుడ్లు, బూడిదతో పూజలు నిర్వహించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు ఘటనలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని జన విజ్ఞాన వేదిక వాళ్లు చెబుతున్నారు.


ఆంధ్రాలోని శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులో క్షుద్రపూజల జాడ కలకలం రేపుతోంది. గీతామందిరం సమీపంలోని గ్రౌండ్‌లో నిమ్మకాయలు, కోడి గుడ్లు, బూడిద వంటి వస్తువులతో పూజలు నిర్వహించిన ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఈ గ్రౌండ్ యువత, చిన్న పిల్లలు నిత్యం క్రీడలు ఆడుకునే ప్రదేశం కావడంతో.. ఇలాంటి ఘటనలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అంతేకాక.. స్థానిక బస్టాండు వద్ద సెల్‌ఫోన్ దుకాణం వద్ద కూడా అక్షింతలు, ఎండు మిరపకాయలు, నిమ్మకాయలు పడేయడం కనిపించడంతో దుకాణ యజమాని ఆందోళన వ్యక్తం చేశారు.

వరుస ఘటనలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. క్షుద్రపూజల వెనుక ఎవరున్నారన్నదానిపై దర్యాప్తు ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రజలు తమ సందేహాలను వెల్లడిస్తూ పోలీసులకు సమాచారం అందించాలన్న విజ్ఞప్తి చేశారు. స్పేస్‌లో అద్భుతాలు చేస్తోన్న ప్రస్తుత సమయంలో ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని జన విజ్ఞాన వేదిక వాళ్లు చెబుతున్నారు.

క్షుద్రపూజల వీడియో దిగువన చూడండి

Also read

Related posts

Share this