March 13, 2025
SGSTV NEWS
Andhra Pradesh

AP Cabinet: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. రంగన్న మృతిపై సమగ్ర విచారణకు ఆదేశం..

ఆంధ్రప్రదేశ్ కేబినెల్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది.. మాజీ మంత్రి వివేక హత్య కేసులో కీలక సాక్షి రంగన్న మృతిపై ఏపీ కేబినెట్‌ సమగ్ర విచారణకు ఆదేశించింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులు సహా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పలు శాఖలో పాలనాపరమైన మార్పులపై కీలక నిర్ణయాలు తీసుకుంది. 14 అంశాలకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది..


ఆంధ్రప్రదేశ్ కేబినెల్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది.. మాజీ మంత్రి వివేక హత్య కేసులో కీలక సాక్షి రంగన్న మృతిపై ఏపీ కేబినెట్‌ సమగ్ర విచారణకు ఆదేశించింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులు సహా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పలు శాఖలో పాలనాపరమైన మార్పులపై కీలక నిర్ణయాలు తీసుకుంది. 14 అంశాలకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన ఏపీ కేబినెట్‌.. 14 కీలక అంశాలపై సమగ్రంగా చర్చించింది. ఖనిజాభివృద్ధిసంస్థ బాండ్లతో రూ.9 వేల కోట్ల సమీకరణ, పంచాయతీరాజ్‌శాఖలో హోదాల సరళీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసం ఏపీ పంచాయ‌తీరాజ్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ స‌ర్వీసు రూల్స్ 2001లో స‌వ‌ర‌ణ‌ల‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.


ఏపీ ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం..
ఉన్నత విద్యకు సంబంధించి ఏపీ ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమంకు సంబంధించి కుప్పంలో రూ.5.34 కోట్లతో డిజిటల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు , వైద్యశాఖలో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.

పార్వతీపురంలో MSME పార్క్‌కు 27.26 ఎకరాలు
రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది కేబినెట్.. పార్వతీపురం మన్యం జిల్లా పనుకువలసలో MSME పార్క్‌ ఏర్పాటు కోసం 27.26 ఎకరాల కేటాయింపుకు అంగీకారం తెలిపింది.


ధవళేశ్వరం వ్యవసాయ కాలేజీకి 10.72 ఎకరాలు
విజయనగరం జిల్లా గాజులరేగలో టీడీపీ ఆఫీసుకు అద్దె ప్రాతిపదికన 2 ఎకరాల భూమిని కేటాయిస్తు నిర్ణయం తీసుకుంది కేబినెట్‌.. అలాగే, ధవళేశ్వరంలో వ్యవసాయ కాలేజీకి 10.72 ఎకరాల భూమి కేటాయించాలని తీర్మానించింది. రాజమండ్రి హవ్‌లాక్‌ పాత వంతెనను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. పర్యాటక శాఖకు 116 ఎకరాల భూమిని కేటాయించింది ఆమోదం తెలిపింది.కాకినాడ జిల్లా తమ్మవరంలో పర్యాటక కేంద్ర అభివృద్ధికి 66.12 ఎకరాలు కేటాయింపుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

గీత కార్మికులకు 336 మద్యం దుకాణాలు
ఇచ్చిన హామీ ప్రకారం గీత కులాలకు 336 మద్యం దుకాణాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎకనామిక్ బోర్డ్‌లో 22 కాంట్రాక్ట్‌ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇలా 14 అంశాలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్‌.

వివేక హత్య కేసుపై చర్చ.. రంగన్న మృతిపై సమగ్ర విచారణకు ఆదేశం
వివేకా హత్య కేసుపై ఏపీ కేబినెట్‌లో చర్చ జరిగింది. కీలక సాక్షి రంగన్న మృతిపై మంత్రివర్గం ఆరా తీసింది. కేసులో నలుగురు చనిపోవడంపై DGP వివరణ కోరింది. మరణాలపై కేబినెట్‌కు వివరణ ఇచ్చారు డీజీపీ గుప్తా.ఈ అనుమానాస్పద వరుస మరణాలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది ఏపీ కేబినెట్‌

Also read

Related posts

Share via