చీటీల పేరుతో గ్రామాల్లోని పలువురి వద్ద నుంచి సుమారు రూ. 2 కోట్ల మేర సొమ్ము వసూలు చేశాడు. ఆపై గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఘరానా మోసగాడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి. రాగంపేట గ్రామానికి చెందిన ఎలుబండి చక్రపాణి అనే వ్యక్తి అనేక కుటుంబాల వద్ద నుంచి చీటీల పేరుతో తమ సొమ్ము కాజేశాడంటూ బాధితులు లబోదిబోమంటున్నారు.
చీటీల పేరుతో గ్రామాల్లోని పలువురి వద్ద నుంచి సుమారు రూ. 2 కోట్ల మేర సొమ్ము వసూలు చేశాడు. ఆపై గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఘరానా మోసగాడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి. రాగంపేట గ్రామానికి చెందిన ఎలుబండి చక్రపాణి అనే వ్యక్తి అనేక కుటుంబాల వద్ద నుంచి చీటీల పేరుతో తమ సొమ్ము కాజేశాడంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. ఊరు విడిచిపెట్టి మకాం మార్చేశాడని అతని వద్ద నుంచి తమ సొమ్ము రికవరీ చేయాలని కోరుతూ పెద్దాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తమ ఆర్థిక అవసరాలు తీరుతాయనే ఆశతో చక్రపాణి అనే ఆసామి వద్ద నెలవారి చీటీలు వేయగా సుమారు రెండు కోట్ల రూపాయలతో అతను పరారైనట్టు స్థానికులు తెలిపారు. తమ కష్టార్జితంతో రూపాయి రూపాయి కూడగట్టి చీటీలు వేసుకోగా చక్రపాణి మోసంతో తామంతా అయోమయానికి గురయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చక్రపాణికి గ్రామంలో సొంత ఇల్లు, పొలం ఉన్నందున అతనిని రప్పించి వాటి ద్వారా తమ సొమ్మును రికవరీ చేయించాంటున్నారు. తమకు న్యాయం జరిపించాలని బాధిత ప్రజలు పోలీసులను కోరుతున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..