కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి. ఈ క్రమంలో చోరీ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి. ఈ క్రమంలో చోరీ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కియా సంస్థకు అవసరమైన విడి భాగాలు విభిన్న ప్రాంతాల నుండి సరఫరా అవుతుంటాయి. ఇందులో భాగంగా, కారు ఇంజిన్లు తమిళనాడు నుండి వస్తుంటాయని తెలిసింది. ఆ మార్గంలో ఎక్కడైనా చోరీ జరిగిందా? లేక పరిశ్రమకు చేరిన తర్వాతే అవి దొంగిలించబడాయా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే కేసు దర్యాప్తు తుదిదశకు చేరినట్టు సమాచారం. త్వరలో అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
Also Read
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!
- జైల్లో ఉన్న భర్తను బెయిల్పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య.. అసలు కారణం తెలిస్తే
- బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్, కోల్కతాతో లింకులు బట్టబయలు..





