తిరుపతి జిల్లా.. రేణిగుంట సమీపంలోని చింతలచేను రేల్వే గేట్.. వచ్చి పోయే ట్రైన్లు, అటుగా వెళ్లే వాహనాలతో ఆ ప్రాంతం హాడావుడిగా ఉంది.. ఈ క్రమంలో రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి అటు ఇటు తిరుగుతున్నాడు.. ఈ సమయంలోనే అతను ఏదో టెన్షన్ పడుతూ.. తేడాగా కనిపిస్తున్నాడు.. దీంతో అక్కడున్న వారికి అనుమానం కలిగింది.. అతను ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కాలేదు.. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో.. గంజాయ్ గప్పుమంటూ అసలు కథ వెలుగులోకి వచ్చింది.. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెట్టు చేశారు. నిందితుడి నుంచి 6 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం..
శుక్రవారం చింతల చేను రైల్వే గేట్ సమీపంలో గంజాయ్ రవాణ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని.. ఆరు కేజీల గంజాయ్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రకాశం జిల్లా, పామూరు మండలానికి చెందిన కదంబూరు రమేష్ గా పోలీసులు గుర్తించారు. గంజాయి సరఫరాలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గోపాల్, చెన్నైకి చెందిన అభి అనే వ్యక్తులు ప్రధాన పాత్ర దారులుగా ఉన్నారని.. వారు పరారయ్యారని తెలిపారు. గంజాయి రవాణాలో సంబంధం ఉన్న ఇరువురి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. పట్టుపడ్డ నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని.. ఈ కేసులో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని ఈస్ట్ ఎస్ఐ హేమాద్రి తెలిపారు.
Also read
- మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..
- Crime news: భర్తని చంపి.. డోర్ డెలివరీ చేసిన భార్య, బంధువులు
- Gandikota Inter Girl: ‘అన్నా ప్లీజ్ నన్ను వదిలేయ్’.. గండికోట యువతి హత్య కేసులో విస్తుపోయే విషయాలు!
- love couple : ఇప్పటికిప్పుడే.. నన్ను పెళ్లి చేసుకుంటావా? లేక చావామంటావా? ఇదేం సైకో లవ్రా నాయనా?
- Atmakur Forest Scam: ఆత్మకూరు ఫారెస్ట్ కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. కోట్లకు కోట్లే గుటకాయ స్వాహా!