వీధికుక్కలు హడలెత్తిస్తున్నాయి. శునకాల దాడులకు ఏమాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. ఏ మూల నుంచి ఏ కుక్క వచ్చి దాడిచేస్తుందో తెలియని భయానక పరిస్థితి ఏర్పడింది.. చిన్నారులను ఒంటరిగా వదిలి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.. వీధిలోనే.. సొంత ఇంటి ముందే ఆడుకుంటున్నా.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. కుక్కలు ఏం చేస్తాయో.. అనే భయంతో ప్రజలు వణికిపోతున్నారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వీధికుక్కలు అలజడి సృష్టించాయి. ఏదో ఒక ప్రాంతంలో చిన్నారుల ప్రాణాలను బలి తీసూకుంటూన్న వీధి కుక్కలు.. తాజాగా.. నంద్యాల జిల్లాలో స్వైర విహారం చేశాయి. నాలుగేళ్ల బాలుడిని చుట్టుముట్టి కరిచి.. పీక్కుతిన్నాయి.. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.. ఈ దారుణ ఘటన బేతంచెర్ల హనుమాన్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్‌నగర్ కాలనీలో హుస్సేన్ బాషా, ఆశ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.. అయితే.. చిన్న కుమారుడు నాలుగేళ్ల మొహిద్దీన్ శుక్రవారం సాయంత్రం మరో బాలుడితో కలిసి ఆడుకుంటున్నాడు.. ఇంటి సమీపంలోనే వారిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో వీధి కుక్కల గుంపు వారిపై దాడికి యత్నించింది.. దీంతో వారిద్దరూ పరుగెత్తారు.. అయినప్పటికీ.. నాలుగు సంవత్సరాల మొహిద్దిన్.. శునకాల దాడికి గురయ్యాడు. శునకాలు ఒకేసారి దాడి చేసి తీవ్రంగా రక్కేశాయి.. దీంతో తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు.. అయితే.. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు
Also Read
- నేటి జాతకములు…4 మే, 2025
- Andhra News: ఇంటి ముందు ఆడుకుంటుండగా ఘోరం.. నాలుగేళ్ల బాలుడిని చుట్టుముట్టిన వీధి కుక్కలు.. ఆ తర్వాత..
- దెయ్యాలు వెంబడిస్తున్నాయంటూ యువకుడు పరుగో పరుగు.. కట్ చేస్తే.. పీక కోసుకుని.!
- పాల ప్యాకెట్‌ను పైనుంచి లాగుతున్నారా.. బీ కేర్ ఫుల్..! విశాఖలో ఏం జరిగిందో తెలుసా..?
- ఆమెకు ఇద్దరు పిల్లలు.. భర్త చనిపోవడంతో అతనికి దగ్గరైంది.. ఆ తర్వాత కొంత కాలానికి..