మృతుడు గుని శెట్టి వెంకటరమణగా గుర్తించారు. డ్యూటీ కోసం ఇంటి నుంచి బయలుదేరిన వెంకటరమణ.. జిరాక్స్ షాపు వద్ద ఆగాడు.. ఆ సమయంలో లారీ మృత్యుశకటంగా దూసుకొచ్చి ప్రాణాలు తీసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ చూస్తే వణికిపోవాల్సిందే.. అంత దారుణంగా ఉంది..
విశాఖపట్నం గాజువాకలో ఓ లారీ బీభత్సం సృష్టించింది.. అదుపుతప్పి హై స్పీడ్ గా దూసుకెళ్లింది.. రోడ్డుకి ఎండింగ్ లో ఉన్న జిరాక్స్ షాపును వేగంతో ఢీకొట్టి ఆగింది.. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఊపిరి వదిలాడు.. ఈ ఘటనలో ఓ వాహనం సైతం ధ్వంసం అయింది. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ చూస్తే వణికిపోవాల్సిందే.. అంత దారుణంగా ఉంది..
ఈ దారుణ ఘటన గాజువాక సుందరయ్య కాలనీ వద్ద జరిగింది. అకస్మాత్తుగా ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకుల్ ఫెయిలై జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లింది లారీ. డ్రైవర్ కంట్రోల్ చేసినప్పటికీ అదుపులోకి రాలేదు. ఈ దుర్ఘటనలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. స్కూటీ ధ్వంసమైంది.
మృతుడు గుని శెట్టి వెంకటరమణగా గుర్తించారు. డ్యూటీ కోసం ఇంటి నుంచి బయలుదేరిన వెంకటరమణ.. జిరాక్స్ షాపు వద్ద ఆగాడు.. ఆ సమయంలో లారీ మృత్యుశకటంగా దూసుకొచ్చి ప్రాణాలు తీసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారీ క్రేన్ సాయంతో లారీని అక్కడి నుంచి బయటకు తీశారు.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది
Also Read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025