SGSTV NEWS online
Andhra PradeshSpiritual

Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. రెండో విశిష్టత ఏంటంటే..

అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా గ్రామోత్సవానికి తరలివేళ్ళగా రాజగోపురం గుండ బృంగివాహనాదీశులైన స్వామిఅమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహారించేందుకు బృంగివాహానంపై స్వామి అమ్మవార్లు విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు.

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. రెండవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి బృంగివాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు,వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో బృంగివాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు.

అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా గ్రామోత్సవానికి తరలివేళ్ళగా రాజగోపురం గుండ బృంగివాహనాదీశులైన స్వామిఅమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహారించేందుకు బృంగివాహానంపై స్వామి అమ్మవార్లు విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు.

ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ వాహనసేవ పూజ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు అధికారులు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు

Also read

Related posts