కంచే చేను మేసింది అన్నట్టుగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. బాధ్యతగా ఉండాల్సినవారే బరితెగించి ప్రవర్తిస్తున్నారు. జనాల మాన, ప్రాణాలను రక్షణగా ఉండాల్సిన వ్యక్తులు.. రాక్షసుల్లా మారుతున్నారు. సమాజంలో ఎలాంటి నేరాలు, ఘోరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యాతయుతమైన హోంగార్డే.. తన బాధ్యతను విస్మరించి పాడుపనికి తెగబడ్డాడు. ప్రియుడిని బంధించి ప్రియురాలిపై ఓ హోంగార్డు అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. దిశ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన లవర్స్ గురువారం ఏకాంతంగా గడిపేందుకు గ్రామ శివారులోకి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అటుగా వెళ్తున్న హోంగార్డు రాజ్‌కుమార్ వారిని గమనించాడు
పోలీసు వెహికల్‌తో అక్కడికి వెళ్లి.. స్టేషన్‌కు రావాలని వారిని బెదిరించాడు. వదిలేయాలని సదరు జంట ప్రాదేయపడటంతో డబ్బులు ఇవ్వాలని డిమాండు చేశాడు. వారు కొంత మనీ ఇచ్చాక.. ప్రియుడిని కట్టేసి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. తీవ్ర వేదనకు గురైన బాధితురాలు శుక్రవారం దిశ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. విజయనగరం జిల్లాకు చెందిన రాజ్‌కుమార్ ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ DSP వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో అతడి వెంట మరో వ్యక్తి ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025