October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: నడిరోడ్డుపైనే నరికి చంపేశారు..! పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!

విశాఖ గాజువాక లో దారుణ హత్య జరిగింది. వేమిరెడ్డి అప్పలనాయుడు అనే మాజీ సైనికొద్యోగి అయిన దివ్యాంగుడిని కత్తితో నరికి చంపేశారు. నడి రోడ్డుపైనే రెండు చేతులు నరికి, మెడపై కత్తితో అత్యంత దారుణంగా దాడి చేసి హతమార్చారు. జగ్గు జంక్షన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also read :Telangana: అర్ధరాత్రి దాటిందంటే గుడారంలో గుట్టుచప్పుడు యవ్వారం.. తెలిస్తే ఫ్యూజులౌట్

వేమిరెడ్డి అప్పలనాయుడు ఆర్మీ లో రిటైర్డ్ అయ్యాడు. అనారోగ్యంతో కాళ్ళు చచ్చు బడి వికలాగుడిగా మారాడు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పలనాయుడుకు భార్య నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే, 2016 లో పాత కర్ణవాని పాలెంలో 148 గజాల స్థలం బంక రాము అనే వ్యక్తికీ అప్పలనాయుడు అమ్మకానికి పెట్టాడు. కొంతవరకు నగదును చెల్లించినట్లు నిందితులు పోలీసుల విచారణలో చెబుతున్నారు. అయితే రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఆ స్థలం విషయంలో అప్పలనాయుడు, రాము మధ్య వివాదం నడుస్తోంది. అయితే, కొద్దిరోజుల క్రితం రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల దృష్టికి కూడా విషయం వెళ్ళింది.

Also read :బిడ్డ కోసం.. జోరు వానలో తల్లి న్యాయ పోరాటం భర్త ఆమెను నానారకాలుగా హింసపెడుతుంటే..

అప్పట్నుంచి కక్ష కట్టిన రాము, అదను కోసం వేచిచూశాడు. తమ మాట వినడం లేదని ఎలాగైనా మట్టుపెట్టాలని ప్లాన్ చేశాడు. తన వాహనం ను వస్తున్న అప్పలనాడును గమనించిన రాము, తన మేనల్లుడు అశోక్ తో కలిసి కాపుకాశారు. జగ్గు జంక్షన్ సమీపంలో కృష్ణానగర్ లో అప్పలనాయుడును గుర్తించిన రాము, అశోక్ తో కలిసి వచ్చి దాడి చేశాడు. నడిరోడ్డుపైనే కత్తితో నరికి చంపేశారని ఏసీపీ త్రినాథ్ తెలిపారు.

Also read :Telangana: బంధువుల నోటిదూలకు నవ దంపతులు బలి.. రైలు కిందపడి సూసైడ్‌!

నేరుగా పోలీస్ స్టేషన్‌కు నిందితులు..

పాశవికంగా జరిగిన హత్యలో అప్పలనాయుడు మోచేయి ఇతర అవయవాలు తెగిపడ్డాయి. అప్పలనాయుడు చనిపోయాడన్న సంగతి నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరు నిందితులు పోలీసుల దగ్గరకు వెళ్లి లొంగిపోయారు. గాజువాక పోలీసులు ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. స్థల విషయంలో తమను ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలోనే హత్య చేసినట్టు నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. అయితే ఇతర కారణాల పైన పోలీసులు కుప్పి లాగుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మృతుడి భార్య సుజాత, తల్లి సత్యవతి. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో హత్య జరగడంతో గాజువాక ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Also read :Andhra Pradesh: బడి నుంచి వెళ్లిన ఏడో తరగతి బాలిక అనుమానాస్పద మృతి.. గ్యాస్‌ డెలివరీ బాయ్‌ ఇంట్లో మృతదేహం!

Related posts

Share via