July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. ఎవరిపై కంప్లైంట్ చేశారంటే..

తనకు ప్రాణహాని వుందని విశాఖ పోలీస్ కమిషనర్‎కు ఫిర్యాదు చేసారు సీబిఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. విశాఖలో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజవర్గం నుంచి జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా జేడీ చేసిన ఈ ఫిర్యాదుతో ఒక్కసారిగా అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

జెడీ లక్ష్మి నారాయణ సీబిఐ జాయింట్ డైరెక్టర్‎గా పలు హై ప్రొఫైల్ కేసులను డీల్ చేసారు. సత్యం రామలింగరాజు కేసు నుంచి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారం, ముఖ్యమంత్రి పై సీబీఐ, ఈడీ కేసుల వరకు అనేక కేసులను డీల్ చేయడంతో లక్ష్మి నారాయణ తెలుగు రాష్ట్రాల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‎గా పేరు సంపాధించుకున్నారు. అనంతరం యూపీ కేడర్ ఐపిఎస్‎కు రాజీనామా చేసిన లక్ష్మి నారాయణ 2019లో రాజకీయ ప్రవేశం చేసి జనసేన నుంచి విశాఖ లోక్ సభకు పోటీ చేసి 2 లక్షల 88 వేలు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలబడ్డారు. అనంతరం జనసేనకు రాజీనామా చేసి తాజాగా జైభారత్ పార్టీ అధ్యక్షుడి హోదాలో విశాఖ నార్త్ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.

గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుల పనేనా?
అయితే విశాఖ సీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్‎కి చేసిన ఫిర్యాదులో జేడీ లక్ష్మీ నారాయణ కొన్ని ఆధారాలను సమర్పించారు. గతంలో తాను డీల్ చేసిన కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల నుంచి తనకు ఈ థ్రెట్ ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కొందరు విశాఖలో ఉన్నారని, వాళ్ళు తన కార్యకలాపాలపై దృష్టి సారించే తనను హత్య చేయడానికి సిద్ధం అయ్యారని, ఆ మేరకు రెక్కి కూడా నిర్వహించారని తనకు అనుమానం ఉన్నట్టు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీస్ విచారణపై అందరిలో ఆసక్తి నెలకొంది.

Also read

Related posts

Share via