చేప పిల్లలకు ఈత ఎవరైనా నేర్పుతారా??? అలాగే మత్స్యకారుడికి చేపల వేట ఎలా చేయాలో ఎవరైనా నేర్పుతారా??? మత్స్యకారుడు అంటేనే నిత్యం నీటిలో వల పట్టుకుని చేపలు వేట చేయడం. అలాంటి జాలరిని తనకు ఇన్నాళ్లు అన్నం పెట్టిన వలే ఉసురు తీసింది. చేపల కోసం వేసిన వలే… ఆ మత్స్యకారుడి పాలిట ఉరితాడు అయింది.
శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలోని చెరువులో చేపల వేటకు వెళ్లి నాగేశ్వరరావు అనే మత్స్యకారుడు మృతి చెందాడు. చేపల వేట కోసం చెరువులో వేసిన ఉచ్చు లాంటి వలలో మత్స్యకారుడు చిక్కుకున్నాడు. చేపల కోసం వేసిన వల మత్స్యకారుడిని బలి తీసుకుంది. నాగేశ్వరరావు అనే మత్స్యకారుడు చేపల కోసం చెరువులో వల వేసి… ఉచ్చు బిగించి ఒడ్డుకు వచ్చాడు. కాసేపటికి వలలో చేపలు చిక్కాయని… చెరువులోకి దిగిన మత్స్యకారుడు నాగేశ్వరరావు కాళ్లకు… తాను వేసిన వలే.. చుట్టుకుని చిక్కుకుంది… దీంతో అతను ఈత కొట్టలేక… వల చిక్కుముడి విడిపించుకోలేక…. ఊపిరాడక మత్స్యకారుడు నాగేశ్వరావు చెరువులోనే మృతి చెందాడు.
చేపల వేటకు అని వెళ్లిన నాగేశ్వరరావు సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో… చెరువు దగ్గరకు వెళ్లిన కుమారుడికి… చెరువు ఒడ్డున తండ్రి నాగేశ్వరావుకు సంబంధించిన వస్తువులు కనిపించాయి. దీంతో కుమారుడు కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చి… చెరువులో గాలింపు చేపట్టారు. కాసేపటికి నాగేశ్వరరావు మృతదేహం చెరువులో దొరికింది. అయితే మత్స్యకారుడు నాగేశ్వరావు కాళ్లకు చేపల కోసం వేసిన వల చుట్టుకోవడంతో… ఈత కొట్టలేక చెరువులో మునిగి మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. విధి ఎంత విచిత్రమైనది అంటే… నిత్యం చేపల వేటకు వెళ్లి… అదే పని చేసుకుంటూ జీవనం సాగించే మత్స్యకారుడిని…. అదే వృత్తి మృత్యువు రూపంలో కబలించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత
- భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్‌తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..
- AP Crime: కన్న కూతురికి చిత్రహింసలు…వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే!
- తిరుపతిలో భారీ చోరీ.. కిలోల బంగారం గోవిందా