ఆ యువతి పేరు రేణుక.. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన రేణుక మాచర్లలోని న్యూటన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్దీ రోజుల క్రితమే వేసవి సెలవుల నుంచి కాలేజ్ కు వచ్చిన రేణుక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
ఆ యువతి పేరు రేణుక.. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన రేణుక మాచర్లలోని న్యూటన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్దీ రోజుల క్రితమే వేసవి సెలవుల నుంచి కాలేజ్ కు వచ్చిన రేణుక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తండ్రి గౌరప్ప ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు ఆమె రాసిన సూసైడ్ లేఖ లభించింది. దీంతో తండ్రి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడంతోనే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
రేణుక కాలేజ్‌లో చదివే యువకుడిని అన్నగా భావిస్తూ ఉంటుంది. అతను తరుచూ రేణుకతో మాట్లాడుతుంటాడు. అయితే నాలుగు రోజుల క్రితం రేణుకకు ఆ యువకుడు ఫోన్ చేశాడు. అయితే, బిజీగా ఉన్న రేణుక ఫోన్ తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన యువకుడు వెంటనే ఆమె తండ్రికి ఫోన్ చేసి రేణుక ఫోన్ తీయని విషయం చెప్పాడు. దీంతో తండ్రి గౌరప్ప వెంటనే ఆమెకు ఫోన్ చేసి మందలించాడు. కాలేజ్‌లో చదువుకునే అమ్మాయికి అబ్బాయిలతో పనేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రేపు కాలేజ్ వద్దకు వచ్చి అసలు విషయాన్ని తేల్చేస్తానన్నాడు. ఆమె ఎంత చెబుతున్నా వినకుండా కోపంతో కేకలు వేశాడు..
ఆ తర్వాత రోజు రేణుక కాలేజ్‌కు వెళ్లలేదు. తండ్రి మాత్రం డోన్ నుండి కాలేజ్ వద్దకు వచ్చాడు. రేణుక గురించి స్నేహితులు విచారించగా.. ఆమె కోసం వెతకగా హాస్టల్ లోని ఒక రూంలో ఉరివేసుకొని చనిపోయి ఉంది. దీంతో ఆమె తండ్రికి సమాచారం ఇచ్చిన స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

అయితే, పోలీసుల విచారణలో ఆమె రాసిన సూసైడ్ లేఖ బయటపడింది. ‘‘నాన్న మీరే నా ధైర్యం.. నువ్వే నన్ను నమ్మకుంటే ఎలా.. నువ్వే నన్ను నమ్మకుంటే.. ఎవరు నమ్ముతారు.. సారీ నాన్న’’ అంటూ ఆమె లెటర్ లో రాసింది.. ఆ అన్న చాలా మంచోడు నన్ను అమ్మలా భావిస్తాడు. అతని తప్పేమి లేదంటూ రాసింది. దీంతో తండ్రితో జరిగిన ఫోన్ సంభాషతోనే ఆమె మనస్థాపానికి గురైనట్లు భావిస్తున్నారు. తండ్రి కాలేజ్ కు వస్తాననటంతో మరింత ఆందోళనకు గురైన రేణుక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేప్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- ఆర్ధిక ఇబ్బందులా, జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
- హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!
- సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం
- Nellore: నెల్లూరు జిల్లాలో భర్త, అత్తమామల పైశాచికం.. కోడలిని వివస్త్రను చేసి హత్య!