February 1, 2025
SGSTV NEWS
Andhra Pradesh

కోనసీమ తిరుమలలో భక్తుల అవస్థలు.. సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు..



డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయానికి నిత్యం వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుండి భక్తులు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇంతటి విశిష్ట ఆలయానికి 2015లో చేసిన డెవలప్మెంట్ తప్ప మరల..


పవిత్ర పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమలగా పేరుగాంచిన అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయానికి నిత్యం పలు రాష్ట్రాలు, జిల్లాల నుండి స్వామిని దర్శించుకోవడానికి వేలమంది భక్తులకు కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాల్లో కార్తీకమాసం,సంక్రాంతి, ముక్కోటి ఏకాదశి లాటి పవిత్రమైన రోజులు వచ్చినప్పుడు భక్తులు దేవస్థాన ప్రాంగణంలో సరియైన సౌకర్యాలు చాలా అవస్థలు పడుతున్నామని భక్తులు ఆవేదన చెందుతున్నారు.

1. ఆలయానికి వెళ్లి ప్రధాన మార్గంలో వారాంతపు సంత నిర్వహించడంతో ఒకవైపు చేపలు మార్కెట్ మరొకవైపు మాంసపు దుకాణాలు భక్తులను విస్మయానికి గురి చేస్తున్నాయని భక్తులు ఆవేదన పడుతున్నారు.

2. కార్లు, బైకులు పార్కింగ్ చేసుకునేందుకు ప్లేస్ లేక తీవ్ర అస్వస్థతలు పడుతున్నారని స్థానికుల ఆరోపణ..


3. వశిష్ట వైనితేయి నదీ తీరంలో పుణ్య స్నానాలు భక్తులు తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలో రెండే రెండు బాత్రూంలో ఉండటంతో స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నా మహిళా భక్తులు ఆవేదన.

4. పవిత్ర రోజుల సమయాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నపుడు క్యూలైన్లు లేక ఎండలోని నిలబడి భక్తులు దర్శనాలకు అవస్తలు పడుతున్నామని భక్తులు ఆవేదన…

5. రాష్ట్రంలో మొట్టమొదటిసారి నిత్యాన్నదానాన్ని ప్రవేశపెట్టిన దేవస్థానం అప్పనపల్లి. అటువంటి దేవస్థానంలో నేడు భక్తులకు అన్నప్రసాదాన్ని తయారుచేసే వంటశాల చిన్నదవడం, బోజన శాల సరిపోకపోవడం పట్ల భక్తులు గంటలు సమయం ప్రసాదాన్ని స్వీకరించడానికి సమయం పట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు.

6.వీఐపీ భక్తులు దర్శనాలకు సమయం ఎక్కువ కేటాయించడంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

7. ఆలయ ప్రాంగణంలో త్రాగుటకు ప్యూరిఫై వాటర్ ప్లాంట్ లేకపోవడంపై భక్తులకు పంచాయతీ వాటర్ సప్లయ్ చేయటం అన్యాయం అని స్థానికులు ఆరోపణ ..

8. పవిత్ర పుణ్యక్షేత్రం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయానికి భక్తులు రావడానికి, పోవడానికి కనీస రవాణా సౌకర్యాలు లేవని ఓకే ఒక ఆర్టీసీ బస్ అప్పనపల్లి నుండీ పాలకొల్లు వరకు త్రిప్పడం కరెక్ట్ కాదని అంటున్న భక్తులు…

9. ఆలయం సమీపంలో ఉన్న మూడు ఎకరాల కొబ్బరి తోట నది కోతకు గురై సుమారు ఎకరంన్నర కొబ్బరి తోట నది గర్భంలో కలిసిపోయిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రోవెన్స్ నిర్మాణం చేపట్టి నదీపాతాన్ని కట్టడి చేయకపోతే రానున్న రోజుల్లో అప్పనపల్లి గ్రామం కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.

కోనసీమ తిరుమలగా గొప్పగా పిలవబడే ఆలయ సమీపంలో కారు , బైకులు పార్కింగ్ ప్లేస్ లేక నాన్న అవస్థలు పడుతున్నామని భక్తులు ఆవేదన. సుధీరా ప్రాంతాల నుండి అప్పనపల్లి రావడానికి బస్సు సౌకర్యాలు లేవని, అప్పనపల్లికి వచ్చే దారి మూడు కిలోమీటర్లు మేర అధ్వానంగా ఉందని NDA కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సత్యనారాయణ ఆలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తులు.

Also read

Related posts

Share via