February 3, 2025
SGSTV NEWS
Andhra Pradesh

CM Chandrababu: తిరుపతి ఘటనపై సర్కార్ సీరియస్.. ముగ్గురు అధికారులపై వేటు..!

తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తిరుపతి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం నుంచి ఆరాతీసిన అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే జేఈవో గౌతమిని బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ క్రమంలోనే తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. డీఎస్పీ రమణకుమార్‌, గోశాల డైరెక్టర్‌ హరినాథరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎస్పీ సుబ్బారాయుడు, ఏఈవో గౌతమిని బదిలీ చేశారు. తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఈ ఘటనలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్‌ ఉద్యోగం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5లక్షలు, గాయపడిన మరో 33 మందికి ఒక్కొక్కరికి రూ. 2లక్షలు అందిస్తామన్నారు. అంతేకాకుండా క్షతగాత్రులు కోలుకునే దాకా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే బాధలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలనే 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని చంద్రబాబు తెలిపారు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులే కానీ 10 రోజులు ఎందుకు చేశారో తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ అంశాన్ని ఆగమ శాస్త్రాలు అంగీకరిస్తాయో లేదో కూడా తెలియదన్నారు. స్వామివారు వెలసినప్పటి నుంచి ఉన్న సంప్రదాయాలను ఉల్లంఘించడం సరికాదన్న చంద్రబాబు.. దీనిపై ఆగమ పండితులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు

Also read

Related posts

Share via