60ఏళ్ల వ్యక్తి బలవంతంగా 16 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. రామాజంనేయులు అనే వ్యక్తి మైనర్ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుని కాపురానికి తీసుకెళ్లాడు. ఇష్టం లేని ఆ అమ్మాయి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకునేటప్పుడు కనీసం వయస్సు కూడా చూడటం లేదు. ఇలాంటి ఘటన తాజాగా అనంతపురంలో జరిగింది. ఓ 60 ఏళ్ల వ్యక్తి బలవంతంగా 16 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్న ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో 60 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి 16 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు.
భార్య చనిపోవడంతో రెండో పెళ్లి..
కూలి పనులు చేసుకునే ఓ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే వీరిలో పెద్ద కుమార్తెకు వివాహం జరగ్గా భర్త చనిపోయాడు. దీంతో పెద్ద కుమార్తె పుట్టింట్లోనే ఉంది. ఇక రెండో కుమార్తెను ఓ 60 ఏళ్ల వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. రామాంజనేయులు అనే వ్యక్తికి రెండేళ్ల కిందట భార్య చనిపోయింది. ఇతనికి ఒక కుమారుడు, కూతురు కూడా ఉన్నారు.
అయినా కూడా ఈ వయస్సులో పెళ్లి చేసుకోవాలని బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను అడిగాడు. దీనికి వారు ఒప్పుకోకపోతే బెదిరించి మరి వారి ఎదురుగా బలవంతంగా తాళి కట్టాడు. ఆమెను బలవంతంగా కాపురానికి తీసుకెళ్లాడు. అయితే ఇష్టం లేని ఆ బాలిక తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగాలని కోరుకుంది
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..