November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

ఏపీలో భారీ పట్టుబడుతున్న నగదు, మద్యం, మాదకద్రవ్యాలు.. ఇప్పటివరకు ఎంతంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అడుగడున చెక్‌పోస్టులు పెట్టి ఓటర్ల ప్రలోభాలకు గురి చేసిన వారిపై నిఘా పెట్టింది ఈక్రమంలో భారీగా నగదు, లిక్కర్, డ్రగ్స్ జప్తు చేసింది. స్వాధీనం చేసుకున్న వాటిలో నగదు, విలువైన వస్తువులు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.


ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రూ.100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేసింది ఎన్నికల కమిషన్. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రలోభపర్చే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను పెంచిన ఎన్నికల సంఘం, అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తోంది. పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్సు, ఫారెస్టు, ఇడి, ఎన్సీబి, ఆర్పిఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్‌ఫోర్సుమెంట్ ఏజన్సీలకు పైబడి ఓటర్లను ప్రభావింతం చేసే వస్తువులపై నిరంతరం నిఘా కాస్తుంది..

ఫలితంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేశారు. ఇందులో కేవలం గత 24 గంటల్లోనే రూ.1.97 కోట్ల విలువైన వస్తువులను జప్తు చేశారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నాటి నుండి నేటి వరకూ చేయబడిన మొత్తం జప్తులో రూ.25.03 కోట్ల నగదు, రూ.12.5 కోట్ల విలువైన 6,14,837.76 లీటర్ల లిక్కర్, రూ.20 కోట్ల విలువైన 68,73,891.25 గ్రాముల డ్రగ్స్ , రూ.51.24 కోట్ల విలువైన 11,54,618.90 గ్రాముల ప్రెషస్ మెటల్స్, రూ.2.42 కోట్ల విలువైన 4,71,020 ఉచితాలను, రూ.7. 05 కోట్ల విలువైన 9,84,148.09 ఇతర వస్తువులను జప్తు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.


అలాగే లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల తేదీలను EC ప్రకటించిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ప్రారంభించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈసీ కేసు నమోదు చేస్తోంది. ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులపై ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని అధికారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.

Also read

Related posts

Share via