July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshTrending

చిత్తూరు : ఆలయ జీర్ణోద్ధరణ పనుల కోసం.. పునాదులను తవ్వుతుండగా బయటపడిన అద్భుతం

పలమనేరు సమీపంలోని కుర్మాయి దగ్గర ఓ గుడి జీర్ణోద్ధరణ పనులు చేస్తుండగా.. పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. మహావిష్ణువు, శ్రీదేవి, భూదేవి పంచలోహ విగ్రహాలు దొరికాయి. ప్రస్తుతం బయటపడిన విగ్రహాలకు భద్రత కల్పించి, జీర్ణోద్ధరణ ముగిశాక ఆలయంలో భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.



చిత్తూరు జిల్లా పలమనేరులో అరుదైన ఘనట వెలుగుచూసింది.  ఆలయ జీర్ణోద్ధరణ పనుల చేస్తుండగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఆదివారం..  కుర్మాయిలో కూర్మ వరదరాజ స్వామి టెంపుల్‌ పనుల సందర్భంగా పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. జేసీబీ సాయంతో గర్భగుడి పునాదులను తవ్వుతుండగా తొలుత ఒక విగ్రహం తల కనిపించింది. వెంటనే అప్రమత్తమైన భక్తులు.. ఆ విగ్రబం చుట్టూరా ఉన్న మట్టి జాగ్రత్తగా తవ్వగా… సుమారు 2.5 అడుగుల ఎత్తుగల శంఖం, చక్రం ధరించిన మహావిష్ణువు విగ్రహం బయటపడింది. ఆ పక్కనే శ్రీదేవి, భూదేవి పంచలోహ విగ్రహాలతో పాటు పూజల కోసం ఉపయోగించే పలు రకాలు లోహ వస్తువులూ బయటపడ్డాయి. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు

ఈ టెంపుల్‌ను 12వ శతాబ్దంలో కౌండిన్య నది ఒడ్డున నిర్మించినట్లు చరిత్రకారులు, శాసనాలను బట్టి తెలుస్తోంది. మహమ్మదీయుల దండయాత్ర నుంచి దేవాలయాన్ని కాపాడుకునేందుకు.. ఆనాటి గ్రామస్థులు  కూర్మ వరదరాజ స్వామి టెంపుల్‌ను మట్టితో కప్పేసినట్లు గ్రామ పెద్దలు చెబుతున్నారు. 1950లో కర్ణాటక.. నంగిలి సమీపంలోని కరిడిగానిపల్లికి చెందిన చెంగారెడ్డి అనే రైతు ఇక్కడికి వచ్చినప్పుడు మట్టి, ఇసుక కింద ఆలయ శిఖరాన్ని గుర్తించినట్లు గ్రామ పెద్దలు చెబుతున్నారు. అప్పుడు బయటపడిన టెంపుల్.. శిథిలావస్థకు చేరింది.



దీంతో జీర్ణోద్ధరణ పనుల కోసం దరాఖాస్తు చేయగా.. రాష్ట్ర దేవదాయశాఖ గతేడాది రూ.1.25 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు జీర్ణోద్ధరణ పనులు చేపట్టగా.. పురాతన పంచలోహ విగ్రహలు.. పూజా కైంకర్యాలను వినియోగించే సామాగ్రి బయటపడ్డాయి. కూర్మవరదరాజస్వామి విగ్రహం భద్రపరచిన చోటనే వీటిని ఉంచి.. పూజలు నిర్వహిస్తున్నారు.  విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల భక్తులు..  విగ్రహాలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.



Also read

Related posts

Share via