February 4, 2025
SGSTV NEWS
Andhra PradeshViral

Watch Video: వల బరువెక్కింది.. లాగి చూస్తే దెబ్బకు షాక్..! చివరకు ఏం జరిగిందో తెలుసా..?

 

అనకాపల్లి జిల్లాలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ వింత అనుభవం ఎదురయింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వలవేశారు. అదికాస్త మరింత లోపలకు వల లాక్కెళ్లారు. ఇంతలోనే వల బరువుగా మారింది. ఏంటా అని పరిశీలిస్తే.. ఓ భారీ చేప కంటపడింది.. నల్లటి భారీ చేప తెల్లటి చుక్కలతో కనిపించింది..

అనకాపల్లి జిల్లాలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ వింత అనుభవం ఎదురయింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వలవేశారు. అదికాస్త మరింత లోపలకు వల లాక్కెళ్లారు. ఇంతలోనే వల బరువుగా మారింది. ఏంటా అని పరిశీలిస్తే.. ఓ భారీ చేప కంటపడింది.. నల్లటి భారీ చేప తెల్లటి చుక్కలతో కనిపించింది.. వివరాల్లోకి వెళితే… అనకాపల్లి జిల్లా పూడిమడక శివారు కడపల నుంచి రోజు సముద్ర వేటకు వెళ్తుంటారు. చేపల వేటే అక్కడి మత్స్యకారులకు జీవనాధారం.. సూరడ వసంతరావు ధర్మతోపాటు మరో 30 మంది వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు. అచ్చుతాపురం రాంబిల్లి సరిహద్దు ప్రాంతంలోని సీతపాలెం తీరంలో వలవేశారు. వలన లాక్కుంటూ లోపలికి వెళ్లారు. ఇంతలో వల బరువుగా అనిపించింది. దీంతో అంతా సంబరపడ్డారు.. భారీగా చేపలు వలకు చిక్కినట్టు పంట పండిందిలే అనుకున్నారు.

మెల మెల్లగా ఆ వలను లాక్కుని తీరానికి వచ్చారు. తీరానికి వచ్చే కొద్ది భారీ కాయంతో ఓ చేప కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. నల్లటి చేపపై తెల్లటి మచ్చలతో ఉన్న వేల్ షార్క్ చిక్కినట్టు గుర్తించారు. అప్పటికే మత్స్యకారుల వాళ్లకు చిక్కిన కొన్ని చేపలను సైతం ఆ చేప తినేసింది. పరిమితికి మించి బరువు ఉండడంతో వల కూడా ధ్వంసం అయింది. దీంతో దాన్ని తీరంలోనే విడిచి పెట్టేశారు.

వీడియో చూడండి..


తీరం వరకు వచ్చేసిన ఆ భారీ వేల్ షార్క్.. సముద్రం లోపల కు వెళ్లలేక తీరంలోనే చాలా సేపు వరకు ఉండిపోయింది. విషయం ఆ నోట ఈ నోటా పాకడంతో భారీగా ఆ చేపను చూసేందుకు తరలివచ్చారు జనం. అయితే తీరంలో విలవిలాడిన ఆ భారీ చేప.. నిరసించింది. సముద్రంలోకి నెట్టే ప్రయత్నం చేసిన మత్స్యకారుల వల్ల కాలేదు.

చివరకు కొన ఊపిరితో మెల్లగా కెరటాల సహకారంతో సముద్రం లోపలకు వెళ్ళిందని అంటున్నారు స్థానిక మత్స్యకారులు. ఈ చేపను పప్పరమేను అని పిలుస్తామని మరికొందరు అంటున్నారు

Also read

Related posts

Share via