February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Acid Attack News: లవర్స్ డే రోజునే దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్‌ దాడి!

 

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ప్యారంపల్లెకు చెందిన యువతిపై మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతిపై ముందుగా కత్తితో దాడి చేసిన యువకులు ఆ తర్వాత ముఖంపై యాసిడ్‌ పోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై యువకుడు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ప్యారంపల్లెకు చెందిన యువతిపై మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, వచ్చే ఏప్రిల్‌ 29న బాధితురాలికి వివాహనం నిశ్చయించారు. ఇంతలో ఎంత ఘోరం జరిగిదంటూ ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరుమూన్నీరుగా విలపిస్తున్నారు. యువతిపై ముందుగా కత్తితో దాడి చేసిన యువకులు ఆ తర్వాత ముఖంపై యాసిడ్‌ పోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. కాగా, ఈ దాడికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే దాడికి గల కారణాలను పోలీసులు త్వరలోనే తెలిపే అవకాశం ఉంది.


నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం..
ఈ యాసిడ్ దాడిపై మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. యాసిడ్ దాడి ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. బాధిత యువతికి వైద్యసాయం అందించి, అండగా నిలుస్తామన్నారు. యాసిడ్ దాడిచేసిన సైకోను కఠినంగా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు

Also read



Related posts

Share via