ఓ తండ్రి తన కొడుకును హత్య చేసి పూడ్చి పెట్టిన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. కొడుకును ప్రేమించే తండ్రి ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? కుటుంబ సభ్యులంతా ఎందుకు ప్రాణభయంతో పరుగులు తీశారు? అసలు కథ ఏంటంటే?
అల్లూరి జిల్లాలోని జీకే విధి మండలం ఏనుగుబైలు గ్రామంలో ఓ ఘటన కలకలం రేపుతుంది. ఆ గిరిజన గూడెంలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. కన్న తండ్రే కొడుకును కడతేర్చాడు. గొడ్డలితో దాడి చేసి ప్రాణం తీశాడు. హత్య చేశాక అడవిలో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతగా కొడుకును ప్రేమించే తండ్రి ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? కుటుంబ సభ్యులంతా ఎందుకు ప్రాణభయంతో పరుగులు తీశారు?
కన్న తండ్రే కొడుకుని హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన అల్లూరి మన్యంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జీకే వీధి మండలం దారకొండ పంచాయితీ ఏనుగు బైలు గ్రామానికి చెందిన కొర్ర సన్యాసిరావు (40) మద్యానికి బానిసయ్యాడు. తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే ఈనెల 14వ తేదీ రాత్రి ఫుల్‌గా మద్యం సేవించిన సన్యాసిరావు.. భార్య దాలిమోర్తిని తీవ్రంగా కొట్టాడు. తరచూ వాడి వేధింపులను భరించలేక ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అంతటితో ఆగని సన్యాసిరావు.. తండ్రితో గొడవ పడ్డాడు. అడ్డుకున్న తల్లిని తమ్ముడిని చితకబాదాడు. దీంతో సన్యాసిరావు నుంచి తండ్రి, తల్లి, తమ్ముడు ఇంట్లో నుంచి తప్పించుకొని పారిపోతుండగా సన్యాసిరావు కత్తి పట్టుకొని వెంబడించాడు. సన్యాసిరావు నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి గ్రామ సమీపంలోని కొండ దగ్గర ఉన్న చెట్టు దగ్గర దాక్కొని ఉన్నాడు తండ్రి.. తీవ్ర ఆగ్రహావేశంతో అటుగా కత్తి పట్టుకొని దాడి చేసేందుకు వచ్చిన సన్యాసిరావు రాకను గమనించాడు తండ్రి.. తనను కొడుకు ఎలాగైనా చంపేస్తాడని భావించి.. తప్పించుకునే ప్రయత్నంలో ఎదురు దాడి చేశాడు తండ్రి. అతని వద్ద ఉన్న గొడ్డలితో కొడుకు తలపై బలంగా కొట్టాడు. దీంతో సన్యాసిరావు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన కొడుకు మృతదేహాన్ని అక్కడే అటవీ ప్రాంతంలో తండ్రి పూడ్చి పెట్టాడు.
ఎలా బయటపడిదంటే?
గొడవ జరిగిన తరువాత నుంచి తన భర్త కనిపించకుండా పోవడంతో.. భార్య ఆందోళన చెందింది. సీలేరు పోలీస్ స్టేషన్లో భార్య దాలి మోర్తి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సీలేరు పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. సన్యాసిరావు హత్యకు గురైనట్లు గుర్తించారు. తండ్రి పిత్రోను అదుపులోకి తీసుకొని సన్యాసిరావు మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలానికి పోలీసులు, జీకే వీధి డిప్యూటీ తహసిల్దార్ కే సీతారాం , స్థానిక పెద్దలు చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితుడని అరెస్టు చేశామని ఎస్సై రవీంద్ర తెలిపారు
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..